Black Panther 2 Collections..రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్..బ్లాక్ పాంథర్ 2 తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే
బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్ (బ్లాక్ పాంథర్ 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11వ తేదీన రిలీజైంది. మార్వెల్ ఫిలిం సినిమా కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూడటంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ కూడా నమోదైంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

బ్లాక్ పాంథర్ బడ్జెట్ ఎంతంటే?
బ్లాక్ పాంథర్ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను 150 మిలియన్ డాలర్లు అంటే.. 1250 కోట్ల వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 2500 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

బ్లాక్ పాంథర్ 2 అడ్వాన్స్ బుకింగ్
బ్లాక్ పాంథర్ సిరీస్‌కు దేశవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంద.ి తొలి రోజున ఈ సినిమా కోసం 1.6 లక్షల టికెట్లు అమ్మడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ సినిమా 5 కోట్లు రాబట్టింది.

బ్లాక్ పాంథర్ ఎన్ని భాషల్లో అంటే.
దేశంలో బ్లాక్ పాంథర్ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా నిడివి 2 గంటల 44 నిమిషాలు. ఈ సినిమా తొలి పార్ట్ ఇండియాలో 52 కోట్ల వసూలు చేసింది. ఈ నేపథ్యంలో బ్లాక్ పాంథర్ చిత్రం అంతకు మించి వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్
బ్లాక్ పాంథర్ 2 సినిమా తొలి రోజు కలెక్షన్లు భారీగానే ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ సినిమా తొలి రోజున ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 8 నుంచి 10 కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

జురాసిక్ వరల్డ్ రికార్డు అధిగమిస్తుందా?
బ్లాక్ పాంథర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ జోష్ చూస్తే సరికొత్త రికార్డులు నమోదు అవుతాయా? అనే అనుమానం కలుగుతుంది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద జురాసిక్ వరల్డ్ డొమినియన్ డే చిత్రం 8 కోట్లు సాధించింది. ఇండియాలో ఇదే అత్యదిక వసూళ్లు సాధించిన మూడో హాలీవుడ్ చిత్రం అని చెప్పుకొంటున్నారు. ఈ రికార్డును అధిగమిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











