Black Panther 2 day 3 Collections.. హాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్న బ్లాక్ పాంథర్ 2.. మూడో రోజు ఎంతంటే?

మార్వెల్ మూవీ బ్లాక్ పాంథర్ 2 చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం తొలి రెండు రోజులు కలెక్షన్ల మోత మోగించింది. అయితే సెలవు రోజు ఆదివారం దారుణంగా వసూల్లు పడిపోవడం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మూడో రోజు సాధించిన కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

తొలి రెండు రోజుల్లో

తొలి రెండు రోజుల్లో

బ్లాక్ పాంథర్ 2 చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజున ఇంగ్లీష్ వెర్షన్‌ 8.5 కోట్లు, హిందీ 3.5 కోట్లు, తెలగుులో 5 లక్షలు, తమిళంలో 30 లక్షలతో మొత్తంగా 12.8 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. ఇంగ్లీష్ వెర్్షన్ 9.5 కోట్లు, హిందీ 3.6 కోట్లు, తెలుగులో 45 లక్షలు, తమిళంలో 30 లక్షలతో మొత్తంగా 13.85 కోట్లు రాబట్టింది.

బ్లాక్ పాంథర్ మూడో రోజు ఎంతంటే?

బ్లాక్ పాంథర్ మూడో రోజు ఎంతంటే?

బ్లాక్ పాంథర్ మూవీ మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. ఇంగ్లీష్ వెర్షన్ 9.57 కోట్లు, హిందీలో 4.34 కోట్లు, తెలుగులో 45 లక్షలు, తమిళంలో 35 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 14.71 కోట్లు రాబట్టింది. గత రెండు రోజులతో పోల్చుకొంటే.. స్వల్పంగా వృద్ధిని సాధించింది.

హాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానంలో

హాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానంలో

బ్లాక్ పాంథర్ చిత్రం హాలీవుడ్‌లో రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. 2022లో రిలీజైన చిత్రాలతో పోటీ పడుతూ ఈ సినిమా మూడో స్థానంలో నిలిచింది. తొలి వారాంతంలో డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం 79.50 కోట్లు, థోర్: లవ్ అండ్ థండర్ 64.8 కోట్లు, బ్లాక్ పాంథర్ 40 కోట్లు, జురాసిక్ వరల్డ్ డొమినియన్ 35.55 కోట్లు వసూలు చేసింది.

కామ్ స్కోర్ డేటా ప్రకారం

కామ్ స్కోర్ డేటా ప్రకారం

అమెరికాలో బ్లాక్ పాంథర్ చిత్రం భారీగా వసూళ్లను నమోదు చేసింది. కామ్ స్కోర్ డేటా ప్రకారం ఈ చిత్రం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ 1 స్థానంలో నిలిచింది. ఈ సినిమా తొలి వారాంతం ముగిసే సమయానికి 200 మిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా ఈ చిత్రం ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌత్ కోరియాలో కూడా టాప్ ప్లేస్‌లో ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల కలెక్షన్లు

బ్లాక్ పాంథర్ 2 చిత్రం యూకేలో 21.1 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌లో 15.1 మిలియన్ డాలర్లు, మెక్సికోలో 13.9 మిలియన్ డాలర్లు, బ్రెజిల్‌‌లో 13.5 డాలర్లు, ఆస్ట్రేలియాలో 10.7 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 330 మిలియన్ డాలర్లు అంటే.. 265 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X