Black Panther 2: ఇండియాలో రెండో రోజు తగ్గని కలెక్షన్లు.. తొలి రోజు కంటే ఎక్కువగా వసూళ్లు

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా సాధించిన చిత్రం బ్లాక్ పాంథర్. చాడ్విక్ బోస్మన్ లీడ్ రోల్ నటించిన ఈ మూవీ 2018లో ఎమ్ సీయూ సిరీస్ లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ గా తాజాగా 'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది మార్వెల్ సంస్థ. నవంబర్ 11న విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. బ్లాక్ పాంథర్ 2 సినిమా రెండో రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందో ఓ లుక్కేద్దామా!

చాడ్విక్ బోస్మన్ లేకుండా

చాడ్విక్ బోస్మన్ లేకుండా

ప్రపంచ సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించే మార్వెల్ సంస్థ నుంచి వచ్చిన మరో సినిమా 'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్'. మొదటి సినిమా భారీగా హిట్ కావడం, అందులోని లీడ్ రోల్ యాక్టర్ చాడ్విక్ బోస్మన్ లేకుండా సీక్వెల్ మూవీ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లెటీటియా రైట్, ఏంజెలా బస్సెట్, టెనాక్ హుయెర్టా, డొమినిక్ థోర్న్ తదితరులు నటించిన ఈ మూవీ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

రూ. 1250 కోట్ల వ్యయంతో

రూ. 1250 కోట్ల వ్యయంతో

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వకాండా దేశాన్ని అతి చిన్న వయస్కురాలైన అమ్మాయి ఎలా కాపాడగలిగిందనేదే బ్లాక్ పాంథర్ 2 చిత్రం. ఈ సినిమాకు మొత్తంగా భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బ్లాక్ పాంథర్ 2 చిత్రాన్ని 150 మిలియన్ డాలర్లు అంటే.. రూ. 1250 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా 2500 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

 దేశవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్లు..

దేశవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్లు..

'బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్' చిత్రం ఇండియా వైడ్ గా తొలి రోజు 12.75 కోట్లు రాబట్టగా.. రెండో రోజు దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ రూ. 9.42 కోట్లు, హిందీ వెర్షన్ రూ. 3.53 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 43 లక్షలు, తమిళ వెర్షన్ రూ. 29 లక్షలు అంటే మొత్తంగా రూ. 14.50 కుపైగా కలెక్షన్లు సాధించింది.

 రెండు రోజుల్లో వచ్చింది..

రెండు రోజుల్లో వచ్చింది..

ప్రపంచంలోనే అతి శక్తివంతమైన లోహం వైబ్రేనియం కోసం రాజు లేని వకాండా దేశంపై మిగతా దేశాలు ఎలా దాడి చేస్తాయి, వాటిని ఆ దేశం ఎలా ధైర్యంగా ఎదుర్కొందో చూపించే సూపర్ యాక్షన్ అండ్ ఎమోషనల్ చిత్రం బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్. ఇలాంటి మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన బ్లాక్ పాంథర్ 2 చిత్రానికి ఇండియావైడ్ గా 2 రోజుల్లో మొత్తం రూ. 27.25 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు ఇలా..

ఇక బ్లాక్ పాంథర్ 2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ చూసుకుంటే.. యూఎస్ఏ లో 4400 థియేటర్లలో ప్రదర్శించబడుతున్న ఈ సినిమా మొదటి వారంలో 175 నుంచి 185 మిలియన్ డాలర్ల వసూళు రాబట్టినట్లు సమాచారం. అలాగే ఇండియాతోపాటు మిగతా దేశాల్లో కలుపుకుని బ్లాక్ పాంథర్ 2 మొదటి వారంలో 140-150 మిలియన్ డాలర్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో బ్లాక్ పాంథర్ ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో రూ. 325 మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

2022లో మూడో చిత్రంగా..

2022లో మూడో చిత్రంగా..

2018లో వచ్చిన ఈ మూవీ తొలి భాగం తొలి రోజు దేశంలో రూ. 5.6 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం వచ్చిన సీక్వెల్ మూవీ మొదటి సినిమా కంటే ఎక్కువగా దేశంలో మొదటి రోజు రూ. 12.5 కోట్లు కొల్లగొట్టింది. మార్వెల్ సంస్థలో 2022లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ తొలి రోజు 28.55 కోట్లు రాబట్టింది. థోర్ లవ్ అండ్ థండర్ 18.2 కోట్లు సాధించాయి. దీంతో బ్లాక్ పాంథర్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే జురాసిక్ పార్క్ వరల్డ్ 8 కోట్లు, బ్లాక్ ఆడమ్ 6.8 కోట్లు, ది బ్యాట్ మెన్ 6.66 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X