Blast Box Office Collections: షాకింగ్‌గా బ్లాస్ కలెక్షన్లు.. తెలుగు, తమిళంలో బాక్సాఫీస్ పరిస్థితి ఏంటంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన తాజా చిత్రం బ్లాస్ట్ జోన్. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అభిరామి తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పతి ఎస్ ఆఘోరమ్, కల్పతి ఎస్ గణేష్, కల్పి ఎస్ సురేష్ నిర్మాతలుగా నిర్మించారు. ఈసినిమాకు తొలి చిత్ర దర్శకుడిగా సుభాష్ కే రాజ్ వ్యవహరించారు.

ఈ సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: రవి బస్రూర్, సినిమాటోగ్రఫి: అరుణ్ రాధాకృష్ణన్, ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్, ప్రొడక్షన్ డిజైనర్: వీరమణి గణేషన్, ఫైట్స్: ఫోనిక్స్ ప్రభు, క్యాస్టూమ్ డిజైనర్: దినేష్ మనోహరన్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. దళపతి విజయ్‌తో బిగిల్, గోట్ సినిమాలు నిర్మించిన ఏజీఎస్ బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో భారీగా హైప్ క్రియేట్ అయింది. ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా ఆసక్తి పెరిగింది. అయితే హైప్‌కు తగినట్టుగా కలెక్షన్లు వచ్చాయా? ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Blast Box Office Report

యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ జోనర్‌తో వచ్చిన బ్లాస్ట్ చిత్రం సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకులు సానుకూలంగా స్పందించారు. ఈ చిత్ర కథను నడిపించిన విధానం.. హై ఎండ్ యాక్షన్ కొరియోగ్రఫి అందర్నీ అలరించేలా చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వెనుకబడింది. మీడియాకు కూడా ఈ సినిమా వచ్చిందా? అనే సందేహం కలిగించింది. మంచి కంటెంట్‌ను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తే తప్పక ఆదరిస్తారనే విషయంపై సినిమా యూనిట్ దృష్టి పెట్టాల్సింది అని ప్రేక్షకులు, ట్రేడ్ అనలిస్టుల అభిప్రాయపడుతున్నారు.

బ్లాస్ట్ సినిమాను సుమారుగా 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ చిత్రంలో అర్జున్, అభిరామి, ప్రీతీ ముకుందన్ తప్పా పెద్దగా గుర్తింపు పొందిన నటీనటులు లేకపోవడం వల్ల పరిమితమైన బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ డిస్ట్రిబ్యూట్ చేసి నైజాం, ఆంధ్రాలో రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ సినిమాకు కొంత మేరకు ఉపయోగపడింది.

అర్జున్ సర్జా నటించిన చిత్రం అటు తెలుగు, తమిళంలోను పెద్దగా బాక్సాఫీస్‌ను ప్రభావితం చేయలేకపోయింది. మండుటెండలు, ఐపీఎల్ ముగింపుకు రావడంతో సినిమా హాళ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం తొలి రోజు సుమారుగా 1 కోటి రూపాయల నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంపై టాక్ పాజిటివ్‌గా పెరిగి రానున్న రోజుల్లో పుంజుకొంటే బాక్సాఫీస్ వద్ద పరిస్థితి తారుమారవుతుందో అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X