For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    చైతు-సమంత కాంబోలో బిగ్గెస్ట్ హిట్: ‘మజిలీ’ ఫస్ట్ వీక్ కలెక్షన్ ఎంతంటే?

    |

    నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'మజిలీ' చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లతో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంది. చైతు, సమంత కాంబినేషన్లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.

    సినిమా విడుదలైన 5 రోజల్లోనే ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి రికవరీ అయింది. గురువారంతో బాక్సాఫీస్ వద్ద వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చైతూ కెరీర్లోనే రికార్డ్ స్థాయి గ్రాస్ కలెక్షన్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

    ఫస్ట్ వీక్ గ్రాస్ రూ. 45.6 కోట్లు

    ఫస్ట్ వీక్ గ్రాస్ రూ. 45.6 కోట్లు

    ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికే వరల్డ్ వైడ్ రూ. 29.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘మజిలీ', 4వ రోజు రూ. 35.55 కోట్ల మార్కును అందుకుంది. 5వ రోజు రూ. 40 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ అవ్వగా... తొలి వారం పూర్తయ్యే నాటికి రూ. 45.6 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    ఇప్పటి వరకు వసూలైన షేర్, లాభం

    ఇప్పటి వరకు వసూలైన షేర్, లాభం

    ‘మజిలీ' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ రూ. 21.14 కోట్లకు అమ్మారు. తొలివారం ఈ చిత్రం రూ. 28.05 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లో ఖాతాలో దాదాపు రూ. 7 కోట్ల లాభం పడింది. ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఫుల్ రన్‌లో భారీ లాభాలు ఖాయమని తేలిపోయింది.

    ఏరియా వైజ్ షేర్

    ఏరియా వైజ్ షేర్

    నైజాంలో రూ. 9.48 కోట్లు, సీడెడ్ రూ. 3 కోట్లు, వైజాగ్ రూ. 3.08 కోట్లు, గుంటూరు 1.63 కోట్లు, కృష్ణ రూ. 1.46 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 1.3 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. రూ. 97 లక్షలు, నెల్లూరు 60 లక్షలు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రూ. 3.03 కోట్లు, ఓవర్సీస్ రూ. 3.3 కోట్ల షేర్ రాబట్టింది.

    కలిసొచ్చిన పోలింగ్ డే

    కలిసొచ్చిన పోలింగ్ డే

    మరో వైపు ఈ చిత్రానికి పోలింగ్ డే కలిసొచ్చింది. బుధవారంతో పోలిస్తే గురువారం (సినిమా విడుదలైన 7వ రోజు) మంచి వసూళ్లు రాబట్టింది. తొలివారంలోనే సినిమా ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందంలో ఉత్సాహం నెలకొంది.

    మజిలీ

    మజిలీ

    శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది, సుశీల్ చౌదరి నిర్మించారు. నాగ చైతన్య, సమంత లీడ్ రోల్స్ చేయగా... దివ్యాంన్ష కౌశిక్ అనే బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైంది. గోపీ సుందర్ సంగీతం, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

    English summary
    Majili continued to storm worldwide box office. The Naga Chaitanya and Samantha Akkineni starrer crossed Rs 45 crore gross mark in 7 days. Majili First Week Share Rs.28.05 cr, Gross : 45.6 cr.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more