పవన్‌పై నమ్మకంతో అన్ని కోట్లు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' చిత్రం ఓవర్సీస్ రైట్స్ బ్లూ స్కై అనే సంస్థ బంపర్ ప్రైస్ చెల్లించి సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సదరు సంస్థ రూ. 3 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగానే పవన్ కళ్యాణ్ సినిమా అంటే కనీసం ఒక్కసారైనా చూస్తారు. కలెక్షన్లు రావనే బెడద ఉండదు. ఆ నమ్మకంతోనే ఆ సంస్థ వారు అన్ని కోట్లు చెల్లించి 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ చిత్రం హిందీ సూపర్ హిట్ మూవీ 'దబాంగ్' చిత్రానికి రీమేక్ కావడం కూడా సినిమాలో ఎంటర్ టైన్మెంట్ అంశాలకు లోటుండదని, అభిమానులు తప్పనిసరిగా నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ బయ్యర్లలో కనిపిస్తోంది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో పవర్ స్టార్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కొండవీడు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. పవర్ స్టార్ తొలిసారిగా ఈ చిత్రంలో హార్స్ రైడింగ్ సీన్లలో కనిపించనున్నారు. శృతి హాసన్ పల్లెటూరి అమ్మయి భాగ్యలక్ష్మిగా దర్శనం ఇస్తోంది. రక్త చరిత్ర విలన్ అభిమన్యు సింగ్ ఈ చిత్రంలో పవర్ స్టార్‌తో తలపడనున్నాడు.
ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











