‘ఈగ’ దెబ్బకు... బోల్ బచ్చన్ విలవిల
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ' చిత్రం శుక్రవారం విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చిన్న పెద్దా మాసు క్లాసు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది . ఈగ చిత్రం ప్రభావం అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ 'బోల్ బచ్చన్'పై కూడా పడింది.
బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌తో మొదలైన బోల్ బచ్చన్....దక్షిణాది మూవీ 'ఈగ' చిత్రం, పంజాబీ చిత్రం 'జాట్ అండ్ జూలీ' విడుదల తర్వాత కలెక్షన్లు తగ్గి పోయాయని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈగ మూవీ హిందీ వెర్షన్ విడుదల కాలేదు కాబట్టి అక్కడ బోల్ బచ్చన్‌కి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే పంజాబ్‌లో, దక్షిణాదిన విడుదలైన మల్టీ ప్లక్స్ థియేటర్లలో మాత్రం కలెక్షన్లు తగ్గిపోయాయి.
ప్రస్తుతం దక్షిణాదికే పరిమితం అయిన 'ఈగ' మూవీ త్వరలో హిందీలో కూడా విడుదల కాబోతోంది. హిందీలో 3డి వెర్షన్ విడుదల చేయనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్య్వూలో రాజమౌళి స్వయంగా వెల్లడించారు. సౌత్‌లో మంచి టాక్ సొంతం చేసుకున్న ఈగ చిత్రం కలెక్షన్లు బాగానే కురిపిస్తోంది. నార్త్ లోనూ ఈగ సంచలన సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే రాజమౌళి ఖ్యాతి దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈగ రికార్డులు బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈగ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వం వహించగా...వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమ్పరణలో విడుదలైన ఈచిత్రానికి సంగీతం : కీరవాణి, సినిమాటోగ్రఫీ : సెంథిల్ కుమార్


Click it and Unblock the Notifications











