»   »  'బాహుబలి'బిజినెస్: హిందీలో పెద్ద సంస్ధకే రైట్స్

'బాహుబలి'బిజినెస్: హిందీలో పెద్ద సంస్ధకే రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ప్రభాస్‌ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జానపద చిత్రం 'బాహుబలి'. రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతూండటంతో బిజినెస్ ఊపందుకుంది. తాజాగా చిత్రం హిందీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరుణ్ జోహార్ ఈ హిందీ రైట్స్ ని తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. దాంతో భారీగా హిందీలో రిలీజ్ అవనుంది. అయితే ఈ రైట్స్ నిమిత్తం కరుణ్ ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ..భారీ మొత్తమే ఖర్చు పెట్టారని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'బాహుబలి-2' ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల వుందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. పాటలను ఏప్రిల్‌ ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.


Bollywood Biggie Grabs Baahubali Hindi Rights

కవచాలు, శిరస్త్రాణం ధరించి, కరవాలం చేతపట్టి యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడే యోధుడిగా ప్రభాస్‌ తాజా పోస్టర్‌లో దర్శనమిచ్చారు. 'మేకింగ్‌ ఆఫ్‌ బాహుబలి' పేరుతో ఇప్పటికే పలు వీడియోలను చిత్రం బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.


.బాహుబలి టైటల్ నే తమిళంలోనూ ఉంచేయటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్ సైతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, మీడియాలో ఓ రేంజిలో పబ్లిసిటీ అవుతూ వస్తోంది. అయితే అందరూ దాన్ని బాహుబలి అనే వ్యవరిస్తున్నారు. మహాబలి అని యూనిట్ పెట్టినా దాన్ని బాహుబలి చిత్రంగానే తమిళ వెబ్ సైట్లు, అక్కడ మీడియా చెప్తూ వస్తోంది.


ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తుండగా, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. 'బాహుబలి' గా ప్రభాస్‌ రూపమేంటో ఇప్పటికే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో రెండో పోస్టరును విడుదల చేశారు. ఈ రెండు ఈ వీరుడి సాధారణ రూపాలు. మరి యుద్ధభూమిలో 'బాహుబలి' ఎలా ఉండబోతున్నాడు అనే ఆతృత అందరిలోనూ కలిగింది. ఓ వైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.


రాజమౌళి అయితే వీలైనంత త్వరలో ఈ సాంకేతికత అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నారు. ఈ విషయం గురించి రూపొందించిన వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టారు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

English summary
Baahubali, have been acquired by none other than Karan Johar, one of the most influential filmmakers in Bollywood. Featuring Prabhas, Anushka, Tamannah and Rana in the lead roles, Baahubali is being directed by Rajamouli.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu