twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR పై అసూయతో కామెంట్స్ చేసి బుక్కైన బాలీవుడ్ హీరో.. కలెక్షన్స్ తో బుద్ధి చెప్పిన ప్రేక్షకులు

    |

    RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై ఇండియన్ సినిమాలలోనే నెంబర్ వన్ మూవీగా సరికొత్త గుర్తింపును అందుకుంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలో అత్యధిక వేగంగా 700 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. చూస్తుంటే ఈ సినిమా 1000 కోట్ల మార్కును మరికొన్ని రోజుల్లో ఈజీగా సాధిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కొంత మంది బాలీవుడ్ ప్రముఖులు RRR సక్సెస్ ను చూసి జలస్ గా ఫీలవుతున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఓ బాలీవుడ్ హీరో పరోక్షంగా RRR సినిమా విజయాన్ని అందుకున్న సందర్భంగా టాలీవుడ్ ను కాస్త చిన్నచూపు చూసినట్లుగా అనిపించండి. అయితే ఆ హీరో సినిమా శుక్రవారం విడుదల కాగా కలెక్షన్స్ తోనే ఊహించని కౌంటర్ పడింది.

    బాహుబలికి ముందు..

    బాహుబలికి ముందు..

    సాధారణంగా బాహుబలి ముందు వరకు కూడా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు బాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ లోనే అన్ని రకాల ఇండస్ట్రీ లను కూడా బాలీవుడ్ వాళ్ళు చిన్న చూపు చూసేవారు అనేది వాస్తవం. ఇక్కడ సక్సెస్ అందుకున్న వారు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టాలీవుడ్ సినిమాలు చేశాము అనే విషయాన్ని కాస్త కూడా గ్రహించరు.

    బాహుబలి తరువాత

    బాహుబలి తరువాత

    ఇక బాహుబలి సినిమా తర్వాత మాత్రమే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇప్పుడు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు. అంతేకాకుండా అక్కడి ప్రముఖ దర్శకులు నిర్మాతలు కూడా మన హీరోలతో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది మాత్రం టాలీవుడ్ ను అసూయతో చూస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

    జాన్ అబ్రహం కామెంట్స్ వైరల్

    జాన్ అబ్రహం కామెంట్స్ వైరల్

    రీసెంట్ గా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం టాలీవుడ్ ను కాస్త తక్కువ చేసి మాట్లాడినట్లుగా అనిపించింది అనే కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్ నెంబర్ వన్ అంటూ తాను టాలీవుడ్ లో గాని ఇతర ఇండస్ట్రీలో గాని ఏదో సైడ్ క్యారెక్టర్ లో నటించను అని చెప్పాడు. జాన్ అబ్రహం అలా అనకుండా సినిమాకు భాషతో సంబంధం లేదు అని మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎవరైనా ఆదరిస్తారు అని ఇతర భాషల్లో కూడా నటిస్తానని అంటే బాగుండేది అనే కామెంట్స్ వస్తున్నాయి.

    RRR కు పోటీగా..

    RRR కు పోటీగా..

    ఏదేమైనప్పటికీ కూడా RRR సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో జాన్ అబ్రహం కాస్త పరోక్షంగానే అసూయను చూపించాడు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక అతని యాక్షన్ మూవీ ఎటాక్ ఏప్రిల్ ఒకటో తేదీన విడుదలవ్వగా ఆ సినిమా కలెక్షన్స్ తో ఈ వారం డామినేట్ చేస్తుంది అనే విధంగా జాన్ అబ్రహం ఓవర్ గా రియక్ట్ అయ్యాడు. ఇక ఊహించని విధంగాఆ సినిమాకు కలెక్షన్స్ రావడం విశేషం. తొలిరోజు ఎటాక్ సినిమా కేవలం మూడు కోట్ల వసూళ్లను మాత్రమే అందుకుంది.

    RRR 8వ రోజు కలెక్షన్స్ కంటే తక్కువగా..

    RRR 8వ రోజు కలెక్షన్స్ కంటే తక్కువగా..

    RRR సినిమా ఎనిమిదవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల సాదించగా అందులో సగంలో సగం కలెక్షన్స్ ని కూడా ఎటాక్ సినిమా మ్యాచ్ చేయలేకపోయింది. బాలీవుడ్ నెంబర్ వన్ ఇండస్ట్రీ అంటూ చాలా మొండిగా జాన్ అబ్రహం చూపించిన బుద్ధికి సరైన గుణపాఠం దొరికింది అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. సినిమా అనేది ఒక భాషకు సంబంధించినది కాదు అని భాషతో సంబంధం లేకుండా అందరి ప్రేక్షకులకు చేరువయ్యేలా ఉండాలని ఆ విషయాన్ని బాలీవుడ్ లో జాన్ అబ్రహం లాంటివాళ్ళు అలాగే మరికొంతమంది గ్రహిస్తే బాగుంటుంది అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Bollywood hero John Abraham Attack collected Rs 3 Cr on opening day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X