డాన్ శీను రైట్స్ కోసం స్టార్ హీరోలు వార్
రవితేజ తాజా చిత్రం డాన్ శీను హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ లో పెద్ద వార్ జరుగుతోందని దర్శకుడు మలినేని గోపీచంద్ చెప్తున్నారు. ఆయన తాజాగా ఓ నేషనల్ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ..అవును..బాలీవుడ్ నా చిత్రంపై విపరీతమైన ఆసక్తి చూపెడుతోంది. దానికి కారణం..మరెవరో కాదు...నా గురువు ఎ.ఆర్.మురగదాస్. ఆయన ఈ చిత్రం గురించి బాలీవుడ్ లో మాట్లాడారు. ఇక నా ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేసి..బాలీవుడ్ స్టార్ సోహెల్ ఖాన్...ఈ చిత్రం డీవీడి పంపమని అడిగారని చెప్పారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తో ఈ చిత్రం చేద్దామనే ఆలోచన ఉందని చెప్పారు. ఇక అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాపై విపరీతమైన ఇంట్రస్ట్ చూపెడుతున్నారు. ఈ చిత్రం రచయిత కోన వెంకట్..ముంబైలో గత వారం రోజులుగా ఉన్నారు. ఆయన్ని సైఫ్ అలీ ఖాన్ రైట్స్ కోసం సంప్రదించారని చెప్పారు. ఇలా నా చిత్రం బాలీవుడ్ రైట్స్ కోసం డిమాండ్ తెచ్చుకుంది అన్నారు. అలాగే సల్మాన్ కానీ, అక్షయ్ కానీ ఎవరైనా ఈ పాత్రకు సరిపోతారు..ఎందుకంటే..సౌతిండియా అక్షయ్ కుమార్....మా రవితేజ అని తేల్చారు.


Click it and Unblock the Notifications











