పుష్పక విమానంపై బాలీవుడ్ కన్ను.. రంగంలోకి టాప్ బ్యానర్స్.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు?
యువ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్‌పై గోవర్దన్ దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి నిర్మించిన పుష్పక విమానం ఇటీవల రిలీజై మంచి ప్రేక్షకులు, సినీ వర్గాల నుంచి మంచి స్పందనను అందుకొన్నది. ఈ సినిమాకు విదేశాల్లో మంచి వసూళ్లు లభిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు సాధించిన చిన్న చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.
అయితే ప్రస్తుతం పుష్పక విమానం సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్‌లోని భారీ సినీ నిర్మాణ సంస్థలు పుష్పక విమానం రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. విభిన్నమైన కథ, మంచి ట్రీట్‌మెంట్, కామెడీ, సస్పెనస్, మిస్టరీ, థ్రిలర్ అంశాలతో రూపొందిన పుష్పక విమానం చిత్రం ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకొన్నది. సినిమాలోని ఉన్నత కథా, సాంకేతిక విలువలు బాలీవుడ్ మేకర్స్‌ను రీమేక్ చేసేలా పోటీకి సిద్ధం చేశాయి.

ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది "పుష్పక విమానం". యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పుష్పక విమానం బాలీవుడ్ రీమేక్ గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు.
త్వరలోనే పుష్పక విమానం సినిమా హక్కులు అమ్మకం విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే రీమేక్ రైట్స్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











