twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు పోటీగా మరో రామాయణ కథ.. బడ్జెట్ 750కోట్లు.. హీరోల రెమ్యునరేషన్ ఎంతంటే?

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా పాన్ ఇండియా సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో అయితే దర్శక నిర్మాతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఎలాగైతే సినిమాలు వరుసగా బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తెరపైకి వస్తున్నాయో అలాగే బాలీవుడ్ లో కూడా అంతకుమించి తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక రామాయణం కథను తెర పైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి కూడా మరొక రామాయణం కథను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఆ సినిమాకి సంబంధించిన రెమ్యునరేషన్ అయితే ఎవరూ ఊహించని విధంగా ఉన్నట్లు తెలుస్తోంది

    3D ఫార్మాట్ లో ఆదిపురుష్

    3D ఫార్మాట్ లో ఆదిపురుష్

    చారిత్రాత్మక కథల ఆధారంగా త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా కథలు తెరపైకి రాబోతున్నాయి. ఇక ఇప్పటికే దర్శకుడు ఓం రావత్ టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ అనే సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే మొదటి సారి ఒక హిస్టారికల్ కథను 3డి ఫార్మాట్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా గ్రాఫిక్స్ తోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే.

     750కోట్ల భారీ బడ్జెట్ తో

    750కోట్ల భారీ బడ్జెట్ తో

    అలాగే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక భారీ చారిత్రాత్మక కథను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దంగల్, చిచోరే దర్శకుడు నితీష్ తివారి ఇటీవల రామాయణం కథను సరికొత్తగా చూపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇక బడ్జెట్ విషయంలో కూడా ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దాదాపు 750 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ప్లాన్ చే

    హీరోలు ఫిక్స్ అయినట్లే..

    హీరోలు ఫిక్స్ అయినట్లే..

    ఇక మొదట మహేష్ బాబును రాముడి పాత్రకు సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారు కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ అంతగా ఆసక్తి చూపక పోవడంతో మళ్ళీ చిత్ర యూనిట్ సభ్యులు బాలీవుడ్ స్టార్స్ వైపు మొగ్గు చూపారు. రాముడి పాత్రలో రణ్ బీర్ నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రావణుడిగా కండలవీరుడు హృతిక్ రోషన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం సినిమాకు సంబంధించిన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. సీత పాత్ర కోసం కూడా కరీనా కపూర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Hero Roshan Smart And Funny Answers | Pelli Sandadi
    రెమ్యునరేషన్ ఎంతంటే?

    రెమ్యునరేషన్ ఎంతంటే?

    అయితే ఈ సినిమాకోసం బడ్జెట్ 750 కోట్ల వరకు అవుతుండగా అందులో హృతిక్ రోషన్ రణ్ బీర్ కపూర్ ఇద్దరికీ కూడా ఒకే తరహా రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికి 75 కోట్ల వరకు పారితోషికం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సీత పాత్ర చేసేందుకు కరీనాకపూర్ 12 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే హీరోలకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా సీత పాత్ర కోసం మాత్రం ఎవరిని ఫైనల్ చేయలేదు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Bollywood ramayana project Hrithik Roshan Ranbir Kapoor remuneration details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X