Bootcut Balaraju షాకింగ్‌గా బూట్‌కట్ బాలరాజు కలెక్షన్లు.. సోహెల్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సోహైల్ ర్యాన్ నటించిన తాజా చిత్రం బూట్‌కట్ బాలరాజు. మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హన్మంతు, సుమన్, వెన్నెల కిషోర్, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి తదితరులు నటించారు. ఈ సినిమాకు శ్రీ కోనేటి దర్శకత్వం వహించారు. ఈ మూవీని కథ వేరుంటుది ప్రొడక్షన్స్, గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాషా నిర్మాతగా, పాండు, మామిడిశెట్టి శ్రీనివాస్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 2వ తేదీన రిలీజైన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బూట్‌కట్ బాలరాజు సినిమాను భారీ తారాగణంతో నిర్మించారు. విలేజ్ డ్రామా, లవ్ స్టోరి అంశాలతో రూపొందిన ఈ సినిమాలోని నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తం ఈ మూవీని 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాపై భారీగా కాన్పిడెన్స్ ఉండటంతో ఓన్ రిలీజ్ చేశారు.

Bootcut Balaraju Box Office Collection worldwide: Syed Sohel Ryans break Even Target here

బూట్‌కట్ బాలరాజు సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ మూవీ 2 కోట్ల రూపాయల షేర్, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. బీ, సీ సెంటర్లలో క్లిక్ అయితే భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.

బూట్‌కట్ బాలరాజు సినిమా ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలను సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ చేశారు. దాదాపు 450 నుంచి 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంత గొప్పగా ఓపెనింగ్స్ సాధించలేకపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కానీ తొలి రోజు తర్వాత క్రమంగా వసూళ్లు పుంజుకొంటున్నాయని వెల్లడించారు.

Bootcut Balaraju Box Office Collection worldwide: Syed Sohel Ryans break Even Target here

బూట్‌కట్ బాలరాజు సినిమాకు తొలి ఆట తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చింది. బీ, సీ సెంటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కలెక్షన్లు పెరిగాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 40 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేస్తుందని చెప్పారు. దాంతో వారాంతంలో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, బూట్‌కట్ బాలరాజు సినిమా తొలి రోజు వసూళ్లు అంతంత మాత్రంగానే వసూలు చేసింది. ఫస్ట్ డే ఈ సినిమా 30 లక్షల నికర వసూళ్లు సాధించింది. రెండో రోజు బెటర్‌గా ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా 50 లక్షల నికర వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X