Border 2 Box Office: బోర్డర్ 2 వసూళ్ల జాతర... రణ్‌బీర్ రికార్డ్ బ్రేక్, 2 వారాల్లో సన్నీడియోల్ మూవీకి ఎన్ని కో
సన్నీడియోల్, వరుణ్ ధావన్, దల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీశ్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్యా సింగ్, మోనా సింగ్ తదితరులు నటించిన చిత్రం బోర్డర్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, జేపీ దత్తాలు ఈ చత్రాన్ని నిర్మించారు. అనురాగ్ సింగ్ ఈ బోర్డర్ 2 చిత్రానికి దర్శకత్వం వహంచారు. అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బోర్డర్ 2 సినిమాకు 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాపై హైప్ నేపథ్యంలో బోర్డర్ 2కి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. సన్నీడియోల్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

బోర్డర్ 2 రెండు వారాల కలెక్షన్స్
బోర్డర్‌కు ఇండియాలో తొలిరోజున 30 కోట్ల రూపాయలు, రెండో రోజున 36.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 54.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 59 కోట్ల రూపాయలు, ఐదో రోజున 20 కోట్ల రూపాయలు, ఆరో రోజున 13 కోట్ల రూపాయలు, ఏడో రోజున 11.25 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజున 10.75 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజున 17.75 కోట్ల రూపాయలు, పదో రోజున 22.5 కోట్ల రూపాయలు, పదకొండో రోజున 5.75 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 5.75 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 4.15 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 3.5 కోట్ల రూపాయలు చొప్పున కలెక్షన్స్ వచ్చినట్లు సాక్ నిక్ తెలిపింది. ఇండియాలో తొలి వారం 224.25 కోట్ల రూపాయలు, రెండో వారంలో 70.15 కోట్ల రూపాయలు రాబట్టింది.
బోర్డర్ 2 ఓవర్సీస్ కలెక్షన్స్
సన్నీడియోల్ మూవీకి ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు అక్కడ 4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 36 కోట్ల రూపాయలు) వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇతర దేశాలలో ఈ సినిమాకు మరో 15 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో బోర్డర్ 2 మూవీకి 52 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది.
బోర్డర్ 2 15వ రోజు కలెక్షన్స్
సన్నీడియోల్ మూవీ శుక్రవారం నాడు మంచి బుకింగ్స్ అందుకుంది. వీకెండ్ కావడంతో మరోసారి మంచి ప్రదర్శన చేసింది. దాంతో 15వ రోజు బోర్డర్ చిత్రానికి ఇండియాలో 2.85 కోట్ల రూపాయల నెట్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో ఇప్పటి వరకు ఈ చిత్రం ఇండియాలో ఇప్పటి వరకు 297.25 కోట్ల రూపాయల నెట్.. 355 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు బోర్డర్ 2 మూవీకి వరల్డ్ వైడ్‌గా 406.35 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా సాక్‌నిక్ వెల్లడించింది.
బోర్డర్ 2 రికార్డ్
అయితే బోర్డర్ 14 రోజుల వరకు ఇండియాలో 323.89 కోట్ల రూపాయల నెట్.. 382.19 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్, ఓవర్సీస్‌లో 52 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 434.19 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లుగా కోయిమోయి వెబ్‌సైట్ వెల్లడించింది. అంతేకాదు.. ఈ కలెక్షన్స్‌తో బోర్డర్ 2 ఓ అరుదైన రికార్డ్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు తెలిపింది. అదేంటంటే .. బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర (430.25 కోట్ల రూపాయలు) లైఫ్ టైం కలెక్షన్స్‌ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 25 హిందీ చిత్రాలలో బోర్డర్ 2 స్థానం సంపాదించినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications











