Border 2 Day 1 Box Office: బోర్డర్ 2 మూవీకి రికార్డు ఓపెనింగ్స్.. గదర్ 2 రికార్డుపై కన్నేసిన సన్నీడియోల్
హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ బోర్డర్ 2. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో బోర్డర్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ముంది? అనే వివరాల్లోకి వెళితే..

250 కోట్ల బడ్జెట్‌తో
ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా 1971 పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం, ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ లాంటి అంశాలతో బోర్డర్ 2 సినిమా రూపొందింది. దేశ సరిహద్దు ప్రాంతంలో అత్యంత భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా యాక్షన్, అండ్ వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో భారీగా సాంకేతిక నిపుణులు, స్టార్ నటీనటులు పాల్గొన్నారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.
భారీగా అడ్వాన్స్ బుకింగ్
ఇండియా, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో నిర్వహించిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిన ఘర్ కబ్ ఆవోగి సాంగ్ ఆడియెన్స్‌లోకి బలంగా వెళ్లడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ, విదేశాల్లో ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా రెస్సాన్స్ లభించింది.
8000 స్క్రీన్లలో
ఈ సినిమాకు నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా చైనా, పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ మూవీకి మంచి క్రేజ్ లభించింది. దాంతో ఈ సినిమాను ఇండియాలో 5000 స్క్రీన్లలో 17 వేలకుపైగా షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 8 వేల స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
5 లక్షల టికెట్లకుపైగా
గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లలో భారీగా బుకింగ్ జరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సుమారుగా 3 లక్షల టికెట్ల అమ్ముడుపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి సుమారుగా 2 లక్షల టికెట్లు ఆఫ్ లైన్, ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరిగింది. దాంతో ఈ సినిమా భారీగా వసూళ్లను నమోదు చేయవచ్చు. బసంత్ పంచమి హాలీడే కూడా ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. యూపీ, బీహార్, బెంగాల్, హర్యానా రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎక్కువగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తొలి రోజు ఎన్ని కోట్ల అంచనా అంటే?
సన్నీడియోల్ నటించిన గదర్ 2 సినిమా తొలి రోజున 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే బోర్డర్ 2 చిత్రం కూడా ఆ రేంజ్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం.. 35 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఈ కలెక్షన్ల రేంజ్ పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు. ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











