Border 2 Day 2 Collections: ధురంధర్‌ రికార్డ్ బ్రేక్..బోర్డర్‌ 2తో సన్నీడియోల్ సరికొత్త చరిత్ర, ఎన్ని కోట్లంటే

సౌత్ సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ దెబ్బతో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతోన్న బాలీవుడ్‌కు గతేడాది బాగా కలిసొచ్చింది. ఛావా, సైయారా, ధురంధర్ తదితర సినిమాలు వందల కోట్ల వసూళ్లు సాధించాయి. ఈ ఏడాది కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని బాలీవుడ్ వర్గాలు పట్టుదలతో ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీడియోల్ నటించిన బోర్డర్ 2పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే తగినట్లుగానే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఏకంగా రణ్‌వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ రికార్డులనే బద్ధలు కొట్టింది. ఈ వివరాల్లోకి వెళితే...

1971 భారత్ - పాకిస్తాన్ యుద్ధం ఇతివృత్తం ఆధారంగా రెండు దేశాల మధ్య జరిగిన ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ ఆధారంగా బోర్డర్ 2 సినిమాను తెరకెక్కించారు. భారత త్రివిధ దళాల అసమాన ధైర్య సాహసాలు, సమన్వయం, సైనికుల బలిదానం, దేశభక్తి కలయికలో ఈ సినిమాను రూపొందించారు. టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ సంయుక్తంగా ఈ బోర్డర్ 2 సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు.

Border 2 Day 2 Expected Box Office Collections Worldwide Sunny Deol Film heading towards 100 crores mark

బోర్డర్ 2 తారాగణం
సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు. అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా స్వరాలు సమకూర్చారు. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 23వ తేదీన బోర్డర్ 2 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? అనేది పరిశీలిస్తే...

బోర్డర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్‌, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి బోర్డర్ 2 సినిమాకు 250 కోట్ల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో నిర్వహించిన ఈవెంట్‌తో బోర్డర్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రేజ్‌కు తగినట్లుగానే ఇండియాలో 5000 స్క్రీన్స్‌లో 17 వేలకు పైగా షోలు ప్రదర్శితమయ్యాయి. విదేశాల్లో దాదాపు 8 వేల స్క్రీన్స్‌లో బోర్డర్ 2 సినిమాను ప్రదర్శించారు.

బోర్డర్ 2 కలెక్షన్స్
అడ్వాన్స్ బుకింగ్‌లోనే బోర్డర్ చిత్రం దుమ్మురేపింది. ఇక తొలి రోజున బోర్డర్ 2కు ఇండియాలో 32 కోట్ల రూపాయలు.. ఓవర్సీస్‌లో 7.50 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ వసూళ్లతో బోర్డర్ 2 పలు రికార్డులు బద్ధలు కొట్టింది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం 55 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌తో ఈ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే గదర్ 2 తర్వాత సన్నీడియోల్‌కు మంచి ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా బోర్డర్ నిలిచింది.

ధురంధర్ ఓపెనింగ్స్ దాటేసిన బోర్డర్ 2
రీసెంట్‌గా బాలీవుడ్‌లో దుమ్ముదులిపిన రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ మూవీ ఓపెనింగ్స్ రికార్డును బోర్డర్ 2 అధిగమించింది. ధురంధర్ తొలిరోజున ఇండియాలో 28 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టగా... బోర్డర్ 2 ఇండియాలో 32 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి కొత్త చరిత్ర సృష్టించింది.

బోర్డర్ 2 రెండో రోజు కలెక్షన్స్
రెండో రోజూ కూడా సన్నీడియోల్ మూవీ బాక్సాఫీస్ వద్ద తన హవా సాగిస్తోంది. శనివారం రాత్రి 8 గంటల వరకు ఈ సినిమాకు ఇండియాలో 35 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. అలాగే కడపటి వార్తలు అందేసరికి బోర్డర్ 2 మూవీకి ఇండియాలో 21 కోట్ల రూపాయల నెట్ వసూలైంది. రెండో రోజు సన్నీడియోల్ మూవీకి ఇండియాలో 30 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని భావిస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లోనే బోర్డర్ 2 వరల్డ్ వైడ్‌గా 75 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాలు, రిపబ్లిక్ డే సెలవు కారణంగా బోర్డర్ 2 ఈ మూడు రోజుల్లోనే అవలీలగా 200 కోట్ల రూపాయలు దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X