5 రోజుల్లో 250 కోట్ల రూపాయలు.. దురంధర్, ఛావా రికార్డులు బోర్డర్ 2 బ్రేక్.. 5వ రోజె ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో దురంధర్ సినిమా తర్వాత బాక్సాఫీస్‌ను బోర్డర్ 2 చిత్రం షేక్ చేస్తున్నది. సన్నీడియోల్ నటించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ స్థాయి వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన విషయం తెలిసిందే. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, జేపీ దత్తా నిర్మించారు. ఈ మూవీని అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా, బోర్డర్ సినిమాకు జేపీ దత్తా డైరెక్షన్ చేశారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ముంది? అనే వివరాల్లోకి వెళితే..

Border 2 Day 5 Expected Box Office Collections

ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా 1971 పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం, ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ లాంటి అంశాలతో బోర్డర్ 2 సినిమా రూపొందింది. దేశ సరిహద్దు ప్రాంతంలో అత్యంత భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా యాక్షన్, అండ్ వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో భారీగా సాంకేతిక నిపుణులు, స్టార్ నటీనటులు పాల్గొన్నారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

బోర్డర్ 2 చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద అలజడి సృష్టిస్తున్నది. ఈ సినిమా మొదటి రోజు 32 కోట్ల రూపాయలు, రెండో రోజు 41 కోట్ల రూపాయలు, మూడో రోజు 57 కోట్ల రూపాయలు, నాలుగు రోజు ఈ సినిమా 63.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో గత నాలుగు రోజుల్లో ఇండియాలో ఈ సినిమా 193.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

బోర్డర్ 2 సినిమాకు విదేశాల్లో కూడా భారతీయ ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్‌లో విడుదలైన ప్రతీ చోట సంచలన రీతిలో కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 228.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఇక ఐదో రోజు కూడా సన్నీడియోల్ నటించిన ఈ మూవీకి అనూహ్యమైన స్పందన లభిస్తున్నదనే విషయాన్ని అడ్వాన్స్ బుకింగ్‌తోపాటు కరెంట్ బుకింగ్ వివరాలు తెలియజేస్తున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా సుమారు 25 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతుందని వెల్లడించారు దాంతో ఈ సినిమా సుమారుగా 250 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేస్తుందనే నిర్ణయానికి వచ్చారు.

బాక్సాఫీస్ వద్ద చూపిస్తున్న జోరు కారణంగా ఇటీవల రిలీజైన దురంధర్, ఛావా, వార్ 2 సినిమాల ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బ్రేక్ చేసింది. వార్ 2 చిత్రం 180 కోట్లు వసూలు చేస్తే.. దురంధర్ 106 కోట్లు, ఛావా 121 కోట్లు రాబట్టింది. కానీ ఈ సినిమా తొలి వారాంతంలోనే 193 కోట్ల నెట్ వసూళ్లను కలెక్ట్ చేయడం రికార్డుగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X