Border 2 Box office: 300 కోట్ల క్లబ్‌లో బోర్డర్ 2.. సన్నీడియోల్ 6 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్‌లో దురంధర్ సినిమా తర్వాత బాక్సాఫీస్‌ను బోర్డర్ 2 చిత్రం షేక్ చేస్తున్నది. సన్నీడియోల్ నటించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే భారీ స్థాయి వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేస్తున్నది. హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన విషయం తెలిసిందే. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, జేపీ దత్తా నిర్మించారు. ఈ మూవీని అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించగా, బోర్డర్ సినిమాకు జేపీ దత్తా డైరెక్షన్ చేశారు. ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ముంది? అనే వివరాల్లోకి వెళితే..

ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా 1971 పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం, ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ లాంటి అంశాలతో బోర్డర్ 2 సినిమా రూపొందింది. దేశ సరిహద్దు ప్రాంతంలో అత్యంత భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా యాక్షన్, అండ్ వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో భారీగా సాంకేతిక నిపుణులు, స్టార్ నటీనటులు పాల్గొన్నారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.
ఈ సినిమా తొలి రోజు 30 కోట్ల రూపాయలు, రెండో రోజు 36.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 54.5 కోట్ల రూపాయలు, 4వ రోజు 60 కోట్ల రూపాయలు, 5వ రోజు 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో దురంధర్ సినిమా తర్వాత అతి వేగంగా 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది. విదేశాల్లో స్థిరపడిన భారతీయ సినీ ప్రేక్షకులకు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. దాంతో ఈ సినిమాకు బ్రహ్మండమైన వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లో 4.5 మిలియన్లు డాలర్లు అంటే.. సుమారుగా 40 కోట్లకుపైగా వసూళ్లను కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











