Border 2 Day 1 Box Office: షాకింగ్‌గా బోర్డర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు.. సన్నీడియోల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
హిందీ సినిమా రంగంలో 1997 సంవత్సరంలో సంచలన విజయం సాధించిన బోర్డర్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ బోర్డర్ 2. యాక్షన్, ఇండియన్ వార్ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సీరిస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించారు. ఈ మూవీకి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు జేపీ దత్తా డైరెక్షన్‌లో బోర్డర్ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరో సన్నీడియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా, సుదేశ్ బెర్రీ, అన్య సింగ్, మోనా సింగ్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి అన్షుల్ చోబే సినిమాటోగ్రఫి, మనీష్ మోరే ఎఢిటింగ్, జాన్ స్టీవార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అనుమాలిక్, మిథూన్, విశాల్ మిశ్రా పాటలు అందించారు. ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ముంది? అనే వివరాల్లోకి వెళితే..
ఇండియా, పాకిస్థాన్ మధ్య 1971 సంవత్సరంలో జరిగిన యుద్ధం బ్యాక్ డ్రాప్‌గా 1971 పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం, ఆపరేషన్ చెంఘీజ్ ఖాన్, పూంచ్, బసంతార్, ఐఎన్ఎస్ కుక్రీ లాంటి అంశాలతో బోర్డర్ 2 సినిమా రూపొందింది. దేశ సరిహద్దు ప్రాంతంలో అత్యంత భారీగా, ఖర్చుకు వెనుకాడకుండా యాక్షన్, అండ్ వార్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణలో భారీగా సాంకేతిక నిపుణులు, స్టార్ నటీనటులు పాల్గొన్నారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది. రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.
బోర్డర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతునన్న ఈ చిత్రానికి భారీ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు విశేషమైన స్పందన నార్త్ ఇండియాలో స్పష్టంగా కనిపించింది. దాంతో ట్రేడ్ వర్గాల్లో అంచనాలు కూడా రికార్డు స్థాయిలో ఏర్పడ్డాయి. దాంతో సన్నీ డియోల్, వరుణ్ ధావన్ కెరీర్లలో హయ్యెస్ట్ కలెక్షన్లు రావొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. బోర్డర్ 2 సినిమాకు నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్లలో భారీగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 3 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం తొలి రోజున 15 నుంచి 17 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రావొచ్చు. వారాంతానికి ఈ సినిమా 35 నుంచి 40 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయవచ్చు అని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, బోర్డర్ చిత్రం గతంలో దేశవ్యాప్తంగా కేవలం హిందీ వెర్షన్‌లో రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. అయితే బోర్డర్ 2 కూడా అంతకుమించి కలెక్షన్లను రాబడుతుంది. ఈ సినిమా తొలి రోజు 35 నుంచి 40 కోట్ల రూపాయల కలెక్షన్లను వరల్డ్ వైడ్ వసూలు చేస్తుందనే విశ్వాసాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 200 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











