ఆంజినేయులు’ విడుదలకు మంత్రి పెద్ద పీట
తెలుగునాట మగధీర ప్రభంజనం కారణంగా కొన్ని సినిమాలు విడుదల విషయంలో వెనక్కి వెళ్ళిపోతుండగా అదే సమస్యే 'ఆంజినేయుల"కు ఎదురైయింది. నటుడు గణేష్ నిర్మాతగా మారి రవితేజ హీరోగా 'ఆంజనేయులు" సినిమాను పరశురామ్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. గణేష్ మా కుటుంబ సభ్యుడు వంటి వాడు అన్న మంత్రి బొత్సా సత్యనారాయణ ఈ చిత్రానికి బ్యాక్ బోన్ అనే ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో బలంగా వుందనే ప్రచారం.
విజయనగరంలోని లక్ష్మి థియేటర్లో టికెట్ కౌంటర్ దగ్గర జరిగిన విద్యుద్ఘాతంలో ఐదుగురు చరిపోయిన విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత అల్లు అరవింద్ కనీసం మృతుల కుటుంబీకులను పరామర్శించలేదు. ఇదిలా ఉంటే సదరు థియేటర్ని బ్యాన్ చేయాలని బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేయడంపట్ల చిరంజీవి అభిమానులు అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. థియేటర్ని మెరుగుపరిచే బదులు సినిమాని బ్యాన్ చేయడమేంటి? అనుకుంటున్నారు.
ఆంజనేయులు చిత్ర విడుదల కోసమే బొత్సా సత్యనారాయణ ఓవరాక్షన్ చేస్తున్నారనే విషయం స్పష్టం కావడంతో, మగధీర చిత్రాన్ని అడ్డుకొంటే బొత్సా సొంత జిల్లాలో 'ఆంజనేయులు" సినిమాని విడుదల కానివ్వమని మెగా అభిమానులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 'మగధీర" పై బ్యాన్ లిప్ట్ అవుతుందా? ఆంజినేయులు సినిమా ఎలాంటి అవాంతరాలు లేకుండా విడుదలవుతుందా? అన్నది సస్పెన్స్...


Click it and Unblock the Notifications











