Bougainvillea Collections: ఫాహద్ ఫాజిల్ రికార్డు ఓపెనింగ్స్.. 100 కోట్ల టార్గెట్, ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మలయాళంలో ప్రముఖ సిని నిర్మాణ సంస్థలు అమల్ నీరాద్ ప్రొడక్షన్స్, ఉదయ పిక్చర్స్ బ్యానర్‌పై నటులు జ్యోతిర్మయి, కున్‌చాకో బోబన్ నిర్మాతలుగా మారి నిర్మించిన చిత్రం బౌగెయిన్‌విలియా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్, కున్‌చాకో బోబన్, జ్యోతిర్మయి, శరాఫ్ యూ దీన్, వీణా నందకుమార్ నటించారు. భారీ అంచనాలతో ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రాయ్‌సీ థామస్ (కున్‌చాకో బోబన్), రీతూ థామస్ (జ్యోతిర్మయి) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అంతా ఊహించినట్టే జరిగితే జీవితం ఎందుకు అనే విధంగా ఓ యాక్సిడెంట్ వారి లైఫ్‌ను తలకిందులు చేస్తుంది. రీతూ తన జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. అయితే కేరళలో టూరిస్టులు అదృశ్యమవుతుండటం అందర్నీ షాక్ గురి చేస్తుంది. ఈ క్రమంలో ఏసీపీ డేవిడ్ కోషి (ఫాహద్ ఫాజిల్)ను విచారణ అధికారిగా నియమిస్తారు.

యాక్సిడెంట్ తర్వాత జ్యోతిర్మయి దంపతులకు ఎదురైన సమస్య ఏమిటి? ఈ కేసులో జ్యోతిర్మయిపై అనుమానాలు వ్యక్తమవుతాయి. అయితే ఈ కేసు దర్యాప్తును డేవిడ్ కోషి ఎలా చేశారు? జ్యోతిర్మయికి ఈ కేసుకు సంబంధమేమిటి? జ్యోతిర్మయికి జ్ఞాపకశక్తి మళ్లీ వచ్చిందా? అనేది ఈ సినిమా కథ.
బౌగెయిన్‌విలియా సినిమాను టాలెంటెడ్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్‌తో భారీగా రూపొందించారు. ఈ సినిమాను భారీగా ప్రమోషన్స్ చేశారు. ఇక ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 50 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా 50 కోట్ల షేర్ 100 కోట్ల రూపాయల గ్రాస్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
బౌగెయిన్‌విలియా మూవీకి తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. మార్నింగ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. కోచిలో 65 శాతం, బెంగళూరులో 45 శాతం, కొట్టాయంలో 55 శాతం, త్రిచూర్, ఇతర ప్రాంతాల్లో 40 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇక తొలి రోజు ఈ సినిమాకు కేరళలోనే రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమాకు మలయాళంలో 3.5 కోట్లకుపైగా, కన్నడలో 50 లక్షలు, తెలుగులో 5 లక్షల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలో 4.5 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసింది. ఓవర్సీస్‌తో కలిపి ఈ సినిమా 6 నుంచి 7 కోట్ల రూపాయాలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











