Bougainvillea Day 2 Collections: ఫాహద్ ఫాజిల్ మూవీ బాక్సాఫీస్ జోరు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మలయాళంలోనే దక్షిణాదిలో టాలెంటెడ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదిచుకొన్న నటుడు ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, జ్యోతిర్మయి తదితరులు నటించిన చిత్రం బౌగెయిన్‌విలియా. ప్రముఖ సిని నిర్మాణ సంస్థలు అమల్ నీరాద్ ప్రొడక్షన్స్, ఉదయ పిక్చర్స్ బ్యానర్‌పై నటులు జ్యోతిర్మయి, కున్‌చాకో బోబన్ నిర్మాతలుగా మారి నిర్మించారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కేరళలో టూరిస్టుల అదృశ్యంపై ఏసీపీ చేసే దర్యాప్తు నేపథ్యంగా అలాగే... యాక్సిడెంట్ బారిన పడిన ఓ ఫ్యామీలీ కథతో ఈ సినిమాను రూపొందించారు. టాలెంటెడ్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్స్‌తో ఖర్చుకు రాజీ లేకుండా ఈ సినిమాను భారీగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 50 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Bougainvillea Day 2 Box Office Collections Worldwide Fahadh Faasil Movie strong at GBOC

కేరళతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి క్రేజ్ రావడంతో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా 50 కోట్ల షేర్ 100 కోట్ల రూపాయల గ్రాస్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలిరోజే కేరళలో బ్రహ్మండమైన వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో కూడా రెస్పాన్స్ బాక్సాఫీస్ భారీగా కనిపించింది.

ఇక బౌగెయిన్‌విలియా మూవీ తొలి రోజు గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా కేరళలో 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ మూవీ 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ధాంతో ఈ సినిమా మొత్తంగా 8 కోట్ల రూపాయలు రాబట్టింది.

Bougainvillea Day 2 Box Office Collections Worldwide Fahadh Faasil Movie strong at GBOC

తొలి రోజు భారీ వసూళ్ల తర్వాత అదే జోష్‌ను రెండో రోజు కనబడింది. ఈ సినిమా కేరళలో సుమారుగా 2.5 రూపాయలు రాబట్టింది. సౌత్‌లో మిగితా రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని వెల్లడించారు. ఈ సినిమాకు మలయాళంలో ఒపెనింగ్స్ క్రేజీగా ఉండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది.

బౌగెయిన్‌విలియా మూవీ రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 8 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు నమోదు అయ్యాయి. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 13 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ వారంతంలో ఈ సినిమా 50 శాతం రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X