బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ రచ్చ.. 150 కోట్ల క్లబ్‌లో యష్.. 100 కోట్లతో రణ్‌వీర్ సింబా!
Recommended Video

కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 చిత్రం శాండల్‌వుడ్ చరిత్రను తిరగరాస్తున్నది. ఈ చిత్రం గత 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకుపైగా వసూలు చేసి భారీ కలెక్షన్ల వైపు దూసుకెళ్తున్నది. బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా వసూళ్లను రాబడుతున్నది. యష్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజైన సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సింబా, జీరో కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

రణ్‌వీర్ సింగ్ సింబా కలెక్షన్లు
ఇక డిసెంబర్ 28న రిలీజైన సింబా చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలివారాంతం తర్వాత రణ్‌వీర్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బలంగా కనిపించింది. శుక్రవారం రూ.20.72 కోట్లు, శనివారం రూ.23.33 కోట్లు, ఆదివారం రూ.31.06 కోట్లు, సోమవారం రూ.21.24 కోట్లు వసూలు చేసింది.

రూ.100 కోట్ల క్లబ్‌లో సింబా
గత నాలుగు రోజుల్లో సింబా రూ.96.35 కోట్లు రాబట్టింది. మంగళవారం కొత్త సంవత్సరం సందర్భంగా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం లేకపోలేదు. దాంతో ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

షారుక్ ఖాన్ జీరో కలెక్షన్లు
కన్నడ డబ్బింగ్ చిత్రంగా రిలీజై బాలీవుడ్‌లో కూడా భారీ ప్రభావం చూపింది. బాలీవుడ్ బాద్షా నటించిన జీరో సినిమాపై అధిపత్యం చూపించింది. హిందీ వెర్షన్ నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. జీరో చిత్రం రెండో వారాంతంలో రూ.3.10 కోట్లు వసూలు చేయగా, గత 11 రోజుల్లో రూ.80 కోట్లు రాబట్టింది.

నిలకడగా కేజీఎఫ్ కలెక్షన్లు
కేజీఎఫ్ చిత్రం రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. బంగారు గనుల మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తొలి ఆట నుంచి విమర్శల ప్రశంసలు అందుకొన్నది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా సెకండాఫ్‌పై విమర్శకులు పెదవి విరిచారు.

కేజీఎఫ్ హిందీ వెర్షన్ వసూళ్లు
కేజీఎఫ్ హిందీ వెర్షన్ శుక్రవారం రూ.1.25 కోట్లు, శనివారం రూ.1.75 కోట్లు, ఆదివారం రూ.2.25 కోట్లతో మొత్తంగా రూ.26.70 కోట్లు రాబట్టింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తొలివారం రూ.21.45 కోట్లు, రెండో వారాంతం రూ.5.25 కోట్లుతో మొత్తంగా రూ.26.70కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











