బాక్సాఫీస్ కలెక్షన్స్: తొలిరోజు దుమ్మురేపిన శైలజారెడ్డి అల్లుడు.. చైతు కెరీర్‌లో హైయెస్ట్!
Recommended Video

అక్కినేని నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించడం, మారుతి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అందులోనూ పండగ హాలిడే కావడంతో తొలిరోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. చైతు కెరీర్ లోనే శైలజారెడ్డి అల్లుడు చిత్రం హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా
దర్శకుడు మారుతి అంటే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలకు పెట్టింది పేరు. మారుతి సినిమాల్లో వినోదం తప్పనిసరిగా ఉంటుంది. శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో కూడా వినోదం ఉంటుందని భావించిన ఆడియన్స్ తొలిరోజు థియేటర్స్ కు ఎగబడ్డారు.

చైతు కెరీర్ బెస్ట్
శైలజారెడ్డి అల్లుడు చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 6.95 కోట్ల షేర్ రాబట్టింది. చైతు సినిమాలలో ఇది అద్భుతమైన ఓపెనింగ్స్ అనిచెప్పొచు. వీకెండ్ ఇంకా ఉండడంతో ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ లోపు ఈ చిత్ర రిజల్ట్ పై ఓ అంచనాకు రావచ్చు.

నైజాం ఏరియాలో
నైజాం ఏరియాలో శైలజారెడ్డి అల్లుడు చిత్రం అత్యధిక స్క్రీన్స్ లో విడుదలయింది. 220 స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల కావడం కలసి వచ్చే అంశం. నైజాంలో శైలజ రెడ్డి అల్లుడు తొలిరోజు 1.71 కోట్ల షేర్ రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాల్లో శైలజారెడ్డి అల్లుడు 5.7 కోట్ల షేర్ రాబట్టింది. వైజాగ్ లో 60 లక్షలు, కృష్ణలో 40, గుంటూరులో 58, ఈస్ట్ గోదావరిలో 70 లక్షల షేర్ రాబట్టడం విశేషం. సీడెడ్ లో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ కోటికి పైగా షేర్ వసూలు చేయడం విశేషం.

ఓవర్సీస్‌లో
ఓవర్సీస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదనే చెప్పొచ్చు. యూఎస్ వ్యాప్తంగా శైలజారెడ్డి అల్లుడు చిత్రం 40 లక్షల షేర్ రాబట్టింది. లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో శైలజారెడ్డి అల్లుడు చిత్ర వసూళ్లు రాబోవు రోజుల్లో ఎలా ఉంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











