Friday box office fight: సుశాంత్ vs సుధీర్ బాబు.. ఓ వైపు సోడా సెంటర్.. మరోవైపు పార్కింగ్ గోల!

ఇటీవల కరోనా సెకండ్ వేవ్ తరువాత మెల్లగా సినిమా థియేటర్స్ తెరుచుకోవడంతో సినిమాలు కూడా ఒక్కొక్కటిగా విడులవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలను థియేటర్స్ లో విడుదల చేసేంత ధైర్యం చేయలేక ప్రత్యామ్నాయంగా ఓటీటీని నమ్ముకుంటున్నప్పటికీ మరికొందరు మాత్రం థియేటర్స్ వైపే చూస్తుండడం విశేషం. ఇక ఇటీవల ఆ విధంగా థియేటర్స్ లో విడుదలై మంచి ఆదరణ అందుకున్న సినిమాలు ఎస్ ఆర్ కల్యాణమండపం, రాజ రాజ చోర కూడా ఉన్నాయి. కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా రాజ రాజ చోర మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పేరు దక్కించుకుంది. ఈ రెండు సినిమాల సక్సెస్ తో మిగతా వారు కూడా థియేటర్స్ లో విడుదల చేసేందుకు ముందుకు రావడం మంచి పరిణామం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

అయితే అదే ఊపుతో ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు మరో ఇద్దరు హీరోలు సిద్ధం అవుతున్నారు. వారిలో ముందుగా సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పలాస 1978 సినిమా తీసిన కరుణ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ వారు దీనిని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మణిశర్మ అందించిన సాంగ్స్ తో పాటు కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి.

Box office fight between sudheer babu and sushanth

ఇక ట్రైలర్ ని సూర్ స్టార్ మహేష్ తో విడుదల చేయించిన యూనిట్, ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రత్యేకంగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. కొద్దిరోజుల్లో అది ప్రసారం కానుంది. అయితే ఈ ఇద్దరు స్టార్స్ ఈ మూవీ కోసం తమవంతుగా సాయం అందించడంతో మూవి పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మంచి యాక్షన్ కం లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అక్కినేని సుశాంత్ నటిస్తున్న సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు కూడా అదే రోజున ఆడియన్స్ ముందుకు రానుంది. యువ దర్శకుడు దర్శన్ తెరకెక్కించిన ఈ మూవీ కోసం హీరో సుశాంత్ ఎంతో కష్టపడ్డాడని, తప్పకుండా ఈ మూవీ సక్సెస్ కొట్టడం ఖయాం అని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ సభ్యులు అన్నారు.

ఇటీవల జరిగిన ఒక యదార్ధ ఘటనని బేస్ చేసుకుని యాక్షన్, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ మొన్న విడుదలై మంచి క్రేజ్ దక్కించుకుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు చేసారు. ఈ విధంగా అటు సుధీర్ ది యాక్షన్ లవ్ స్టోరీ కాగా, ఇటు సుశాంత్ ది యాక్షన్ కమర్షియల్ మూవీ. మరొక రెండు రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ పోరులో నిలవనున్న ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని దక్కించుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X