బాక్సాఫీస్ Godzill‘AA’ .. రాజమౌళి అడ్రస్ గల్లంతు, ఇకపై నాన్ అల్లు అర్జున్ రికార్డ్సే

భారతదేశంలో సినిమా అంటే అమితంగా ఆరాధించే వారిలో మన తెలుగు సినిమా ఆడియెన్స్ ఎపుడు ముందు ఉంటారు. అయితే ఇతర భాషల్లో ఏమో కానీ మన తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఒకో హీరో ఫ్యాన్స్ అంతా ఆ రికార్డు ఈ రికార్డు అని ఎప్పుడు సోషల్ మీడియాలో కొట్టుకు చస్తూ ఉంటారు. తరాలు మారుతున్న కొద్దీ మన హీరోలు కొట్టే రికార్డులు పెరుగుతున్నాయి.

సినిమాల వసూళ్లు కూడా నానాటికీ పెరుగుతున్నాయి. దీనితో అభిమానులు కూడా అంతే స్థాయిలో తమ డోస్ పెంచుతున్నారు. ఇలా వస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ రికార్డ్స్‌ని మార్చేశారు. అప్పటి వరకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ అని మెగాస్టార్ చిరంజీవి అని ఇలా చాలా మంది హీరోల టాప్ రికార్డులు ఉండేవి. కానీ ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా విడుదల చేసారో ఆ దెబ్బతో అక్కడి నుంచి తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర "నాన్ బాహుబలి" అనే కొత్త మాట మొదలైంది.

Box office Godzillaa allu arjun became non allu arjun record maker crossing Rajamouli

అంటే బాహుబలిని కొట్టని బిగ్గెస్ట్ రికార్డు ఏదన్నా ఉంది అంటే అది నాన్ బాహుబలి రికార్డు అనమాట. ఇక్కడి నుంచి ఇదే ట్రెండ్ బాహుబలి 2తో కూడా కొనసాగింది. ఇక మళ్ళీ ఈ రికార్డులని ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాతోనే ఓపెనింగ్స్ లో తెలుగు స్టేట్స్ లో బ్రేక్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు టాప్ స్టార్స్ ఉండేసరికి ఆ క్రెడిట్ రాజమౌళికి ఇచ్చి నాన్ రాజమౌళి రికార్డ్స్ అంటూ సెట్ చేసారు. కాగా ఆర్ఆర్ఆర్ నుంచి నాన్ రాజమౌళి అనే బ్రాండ్ ఇండియా వైడ్‌గా ముద్ర పడిపోయింది.

అయితే దీనిని ప్రభాస్, ఎన్టీఆర్‌లు చాలా దగ్గరికి వచ్చినా బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఒక హీరో మాత్రం నాన్ రాజమౌళి రికార్డ్స్ అనే మాటని బ్రేక్ చేసి ఊహించని ఓపెనింగ్స్ ని సెట్ చేసాడు. ఆ హీరోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ నటించిన పుష్ప 2కి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి కారణం అల్లు అర్జున్ అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Box office Godzillaa allu arjun became non allu arjun record maker crossing Rajamouli

అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సెన్సేషనల్ సీక్వెల్ తో మొదటి రోజే బిగ్గెస్ట్ రికార్డు, భారీ మార్జిన్‌తో క్రాస్ చేసి పారేసాడు. ఇక్కడి నుంచి మొదలైన రికార్డ్స్ ఇపుడు నాన్ అల్లు అర్జున్ రికార్డులు అనే మాటకి వచ్చేసాయి. ఇన్ని రోజులు ఉన్న నాన్ రాజమౌళి అనే ప్రెస్టీజియస్ మాట అల్లు అర్జున్‌కి దాసోహం అయ్యింది. లేటెస్ట్ గా అయితే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 కోట్ల మార్క్‌‌ని అందుకున్న పుష్ప 2తో తమ అభిమాన హీరోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కి గాడ్జిల్లాగా ప్రకటించుకున్నారు.

మరి గాడ్జిల్లా ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ట్రెండ్‌లో కేవలం 6 రోజుల్లోనే ఓ సినిమా రూ.1002 కోట్లు గ్రాస్ కొట్టడం అనేది అనితర సాధ్యం. అందుకే బాక్సాఫీస్ గాడ్జిల్లాగా అల్లు అర్జున్‌ని ఇపుడు అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా ఒప్పుకుంటున్నారు. ఇలా ఐకాన్ స్టార్ ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర చరిత్ర సృష్టించి నాన్ అల్లు అర్జున్ అనే మాటని సొంతం చేసుకున్నాడు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X