‘దేవ్’ బాక్సాఫీస్ రిపోర్ట్: కార్తి ఖాతాలో మరో డిజాస్టర్
తమిళ స్టార్ కార్తి ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందిన 'దేవ్' తొలి రోజు నుంచే టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సెకండ్ డే నుంచే కలెక్షన్స్ పడిపోయాయి.
తెలుగులో మాత్రమే కాదు... అటు తమిళనాడులో కూడా 'దేవ్' చిత్రానికి ప్రేక్షకాదరణ లేక థియేటర్లు వెలవెలపోతున్నాయి. ఫుల్‌రన్‌లో కూడా ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో 50 శాతం రాబట్టే పరిస్థితులు కనిపించడం లేదు.

థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్మారు?
‘దేవ్' థియేట్రికల్ రైట్స్ తమిళనాడులో అన్ని ఏరియాలకు కలిపి రూ. 17 కోట్లకు అమ్ముడయ్యాయి. తెలుగులో ఈ చిత్రం రైట్స్ ఠాగూర్ మధు రూ. 6 కోట్లకు సొంతం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈ మూవీ నష్టాల దిశగా పరుగులు పెడుతోంది.

తమిళనాడులో వసూళ్లు
కోలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తొలి 6 రోజుల్లో ‘దేవ్' తమిళనాడు వ్యాప్తంగా కేవలం రూ. 5 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్‌లో ఇంకొక రూ. 1 కోటి వసూలు చేయొచ్చని... 35శాతం కంటే ఎక్కువగా రికవరీ అయ్యేపరిస్థితి లేదని ట్రేడ్ వర్గాల టాక్.

తెలుగులో భారీ నష్టం
తెలుగు రాష్ట్రాల్లో ‘దేవ్' తొలి 6 రోజుల్లో కేవలం రూ. 1.85 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్‌లో రూ. 2 కోట్లకు మించి వసూలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పని పరిస్థితి.

టాలీవుడ్లో కార్తి మార్కెట్ డౌన్
తెలుగులో కార్తి మార్కెట్ సినిమా సినిమాకు పడిపోతోంది. అతడి గత చిత్రం ‘చినబాబు' తమిళనాడులో విజయం సాధించినపస్పటికీ టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు.
దర్శకత్వం: రజత్ రవిశంకర్
నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు,
నిర్మాణ సంస్థలు: ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్
సమర్పణ: రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్
సంగీతం: హరీష్ జయరాజ్
సినిమాటోగ్రఫీ: వేల్రాజ్
ఆర్ట్: రాజీవన్
ఎడిటర్: రూబెన్
విఎఫ్ఎక్స్: హరిహరసుధన్ .


Click it and Unblock the Notifications











