బోయపాటి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్!
భద్ర, తులసి, సింహా లాంటి విజయవంతం అయిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు బోయపాటి శ్రీను త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. మాస్ ప్రేక్షకులు మెచ్చే వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ఎక్స్ పర్ట్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి పవన్ కళ్యాన్‌తో విభిన్నమైన చిత్రానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హారిష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' చిత్రం చేస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్టులేని పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. బోయపాటి ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా 'దమ్ము' చిత్రం రూపొందిస్తున్నారు. బహుషా ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పవన్-బోయపాటి సినిమా విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాన్...పూరి జగన్నాథ్, రాజ సుందరం, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో సినిమాలు కమిట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











