twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda అప్పుడు రెమ్యునరేషన్ త్యాగం చేసిన బోయపాటి.. ఇప్పుడు లాభాల్లో వాటా ఎంతంటే?

    |

    పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి అఖండ సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. నందమూరి బాలకృష్ణ తో ఇదివరకే వరుసగా రెండు బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే మొదట ఈ సినిమా కోసం పెద్దగా రెమ్యునరేషన్ ఏమీ తీసుకోలేదని టాక్ వచ్చింది. బడ్జెట్ ఇతర కారణాల వలన ఆయన రెమ్యునరేషన్ కూడా లెక్కచేయలేదని కథనాలు వెలువడ్డాయి. అయితే మొత్తానికి బోయపాటి అఖండ సక్సెస్ అనంతరం లాభాల్లో వాటా గట్టిగానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

    Recommended Video

    Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
    ఎవరితో వర్క్ చేసినా..

    ఎవరితో వర్క్ చేసినా..

    భద్ర సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బోయపాటి శ్రీను మొదటి నుంచి కూడా మాస్ కమర్షియల్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తున్నాడు. ఎలాంటి హీరో తో వర్క్ చేసినా కూడా అందులో మాస్ ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూసుకుంటాడు. యాక్షన్ ప్రియులకి ఒక ఫుల్ మీల్స్ ఇచ్చే తరహాలో బోయపాటి స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు అని దాదాపు అన్ని సార్లు రుజువైంది.

    తక్కువ సినిమాలే అయినా..

    తక్కువ సినిమాలే అయినా..

    బోయపాటి ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా కొన్ని సినిమాలతో మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసాడు అనే చెప్పాలి. బాలకృష్ణతో సింహా లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్లాక్ చేసింది.

     డిజాస్టర్స్ రావడంతో..

    డిజాస్టర్స్ రావడంతో..


    అయితే అఖండ సినిమా కంటే ముందు దర్శకుడు బోయపాటి వరుసగా రెండు డిజాస్టర్స్ తో ప్లాప్స్ లో ఉన్నాడు. జయ జానకి నాయక సినిమా తో పాటు వినయ విధేయ రామ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫలితాలని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ రెండు అపజయాల అనంతరం బోయపాటి మరో సినిమా చేయడానికి చాలా టైమ్ పట్టింది. కొన్ని కథలు కూడా రిజెక్ట్ అయ్యాయి. అందుకే అఖండ సినిమాతో ఎలాగైనా మళ్లీ ట్రాక్ లోకి రావాలని అనుకున్నాడు.

     బడ్జెట్ విషయంలో ఇబ్బందులు

    బడ్జెట్ విషయంలో ఇబ్బందులు


    మొత్తానికి బాలకృష్ణ తో మరోసారి మంచి సక్సెస్ అందుకున్న బోయపాటి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ సినిమా కోసం మొదట 70 కోట్ల బడ్జెట్ అనుకున్నారట. కానీ బోయపాటి గత వైఫల్యాల కారణంగా అంత బడ్జెట్ పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఇక ఆ లెక్కను 50 కోట్ల వరకు తేవడంతో మిర్యాల రవీందర్ రెడ్డి ఒప్పుకున్నాడు. అది కూడా దర్శకుడు బోయపాటి రెమ్యునరేషన్ త్యాగం చేస్తే ఆమాత్రం బడ్జెట్ కేటాయించినట్లు గా కథనాలు వెలువడ్డాయి.

    ముందుజాగ్రత్తగా..

    ముందుజాగ్రత్తగా..


    గత రెండు సినిమాలు కూడా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ బోయపాటి మాటలు నిర్మాత కూడా పెద్దగా లెక్క చేయలేదు అనే వార్తలు అయితే గట్టిగానే వచ్చాయి. ఇక చేసేదేమీలేక బోయపాటి అఖండ సినిమా కోసం తను మార్కెట్ కూడా ఏమాత్రం లెక్కచేయకుండా రెమ్యునరేషన్ చాలా తక్కువగా తీసుకున్నాడట. అయితే ముందు జాగ్రత్తగా లాభాల్లో వాటా తీసుకునేందుకు విధంగా కూడా ఒప్పందం చేసుకున్నారట.

     బోయపాటి వాటా ఎంతంటే?

    బోయపాటి వాటా ఎంతంటే?

    కేవలం థియేట్రికల్ గానే అఖండ సినిమా 17 కోట్లకు పైగా లాభాలను అందించింది. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ గా కూడా ఈ సినిమాకు మంచి లాభాలు వచ్చాయి. అయితే మొత్తంగా బోయపాటి శ్రీనివాస్ చేసిన త్యాగానికి నిర్మాత మంచి షేర్ ను అందించినట్లు తెలుస్తోంది. అసలైతే 9 కోట్ల పారితోషికం ఇస్తే సరి పోయే దానికి ఇప్పుడు లాభాల్లో వాటా అందుకోగా మొత్తంగా బోయపాటి 15 కోట్లకు పైగా ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం.

    English summary
    Boyapati srinu share and remuneration in akhanda profits
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X