twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖండ తరువాత బోయపాటి షాకింగ్ బడ్జెట్.. ఆ హీరో కోసం బాలయ్య కంటే ఎక్కువగా..

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి మాస్ దర్శకుడిగా గుర్తింపు అందుకున్న వారిలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మాస్ ఎలిమెంట్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. మాస్ ఇమేజ్ కావాలి అనుకునే ప్రతి హీరో కూడా బోయపాటి శ్రీనుతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. ఇక బోయపాటి శ్రీను అఖండ సినిమా తర్వాత ఒక యువ హీరోతో సినిమా చేయాలని రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం భారీ స్థాయిలో బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

    బాలయ్యతో హ్యాట్రిక్

    బాలయ్యతో హ్యాట్రిక్

    దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటారు అని అఖండ సినిమాతో నిరూపించాడు. వీరి కాంబినేషన్ కు ఎలాంటి గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వచ్చిన ఆ సినిమా అంతకు మించిన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే దర్శకుడు బోయపాటి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు.

    అఖండ 2 మల్టీస్టారర్?

    అఖండ 2 మల్టీస్టారర్?

    అంతే కాకుండా అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను ఎలాగైనా మరొక మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అడుగులు వేస్తున్నాడు. ఇదివరకే అఖండ సినిమాకు సీక్వెల్ గా ఉంటుంది అని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోసారి బాలయ్య బాబు తో సినిమా చేస్తానని కూడా బోయపాటి వివరణ ఇచ్చాడు. ఇక ఆ సినిమా ప్రాజెక్టు మల్టీస్టారర్ గా కావచ్చని కూడా అతను తెలియజేశాడు. కుదిరితే అల్లు అర్జున్ నటించవచ్చు అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    పాన్ ఇండియా మూవీ

    పాన్ ఇండియా మూవీ

    అయితే దర్శకుడు బోయపాటి తన తదుపరి సినిమాను యువ హీరో రామ్ పోతినేని తో చేయబోతున్నాడు. ప్రస్తుతం ఆ హీరో కోసం ఒక పవర్ఫుల్ కథను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు ఆ ప్రాజెక్టు తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక బోయపాటి రామ్ పోతినేని కలయికలో వచ్చే సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరపైకి రానుంది.

    బాలయ్య కంటే ఎక్కువగా..

    బాలయ్య కంటే ఎక్కువగా..

    ఇక మొదటి సారి చేయబోయే పాన్ ఇండియా సినిమా కోసం బోయపాటి ఎవరూ ఊహించని రేంజ్ లో బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రాజెక్టును శ్రీనివాస్ చిట్టూరి శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో నిర్మించనున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు బడ్జెట్ కు సంబంధించిన సిషయాలపై కూడా ఇటీవల దర్శకుడు నిర్మాతతో చర్చించినట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బోయపాటి ఈసారి అత్యధిక బడ్జెట్తో సినిమాను నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా బాలయ్య అఖండ కంటే ఎక్కువగా ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం.

    వంద కోట్ల బడ్జెట్?

    వంద కోట్ల బడ్జెట్?

    రామ్ పోతినేనికి హిందీ ఆడియోన్స్ లో మంచి క్రేజ్ అయితే ఉంది. అతని ప్రతి సినిమా హిందీలో డబ్బింగ్ అవుతూ యూట్యూబ్లో మిలియన్స్ వ్యూవ్స్ కూడా వస్తూ ఉంటాయి. తెలుగులో ఫెయిల్ అయిన సినిమాలు కూడా హిందీ జనాలు ఎగబడి చూసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే రామ్ సినిమా కోసం ఏ మాత్రం తగ్గకుండా వంద కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ప్రాజెక్ట్ మొదలయ్యే వరకూ ఆగాల్సిందే.

    English summary
    boyapati srinu shocking budget design for ram pothineni upcoming project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X