F1: The Movie: ఇండియాలో హాలీవుడ్ చిత్రం ప్రభంజనం .. బుక్ మై షోలో బ్రాడ్ పిట్ మూవీ సరికొత్త చరిత్ర

ఓ పదేళ్లు వెనక్కి వెళితే.. రిలీజైన సినిమా ఖచ్చితంగా 10 నుంచి 15 వారాల పాటు థియేటర్‌లో ఖచ్చితంగా ఉండేది. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కనీసం నాలుగు వారాలు తగ్గకుండా థియేట్రికల్ రన్ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. ఎంత హిట్ సినిమా అయినా సరే 4 వారాలు థియేటర్‌లో ఉండటం లేదు. తొలి వారంలోనే పెట్టిన పెట్టుబడిన వెనక్కి తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. జనానికి సినిమా నచ్చితే ఓకే.. లేదంటే నాలుగు రోజుల్లోనే ఎత్తేస్తున్నారు. అలాంటిది ఓ ఇంగ్లీష్ చిత్రం మనదేశంలో టికెట్ బుకింగ్స్‌లో.. కలెక్షన్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

రేసింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఎఫ్ 1
హాలీవుడ్ సూపర్‌స్టార్ బ్రాడ్‌పిట్ నటించిన చిత్రం ఎఫ్ 1: ది మూవీ. ఫార్ములా 1 బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. యాక్షన్‌కు పెట్టింది పేరైన బ్రాడ్ పిట్ ఈ చిత్రం కోసం ఫార్ములా వన్ రేసర్‌గా అవతారం ఎత్తారు. జోసెఫ్ కోసిన్‌స్కి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 1లో దామ్సన్ ఐడ్రిస్, కెర్రీ కాండన్, జేవియర్ బార్డెమ్, టోబియాస్ మెంజిస్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యాపిల్ స్టూడియోస్, జెర్రీ బ్రూక్‌హైమర్ ఫిల్మ్స్, ప్లాన్ బీ ఎంటర్‌టైన్‌మెంట్, మోనోలిత్ పిక్చర్స్, డాన్ అపోలో ఫిల్మ్స్ బ్యానర్స్‌పై .. జెర్రీ బ్రూక్‌హైమర్, జోసెఫ్ కోసిన్‌స్కీ, లేయిస్ హామిల్టన్, బ్రాడ్ పిట్, డేడ్ గార్డ్‌నర్, జెరెమీ క్లెనెర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Brad Pitt s F1 The Movie managing a 42-day trending streak on Book My Show India

ఎఫ్ 1: ది మూవీ బడ్జెట్ ఎంత?
ఫార్ములా వన్ రేసింగ్‌లు జరుగుతున్నట్లుగా అనుభూతి కలిగించేందుకు చిత్ర యూనిట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఇతర టెక్నికల్ అంశాల కోసం భారీగా ఖర్చు పెట్టారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి ఎఫ్ 1: ది మూవీకి 300 మిలియన్ డాలర్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఎఫ్ 1: ది మూవీ కలెక్షన్స్ ఎంత?
ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 143 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 1200 కోట్ల రూపాయలు) రాబట్టి సంచలనం సృష్టించింది. ఆగస్ట్ 6 వరకు ఎఫ్ 1 : ది మూవీ.. అమెరికా, కెనడాలలో 175 మిలియన్ డాలర్లు.. ఇతర దేశాల్లో 380 మిలియన్ల డాలర్లు రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు బ్రాడ్ పిట్ మూవీ 555 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది. ఇండియాలో ఈ చిత్రం ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

బుక్ మై షోలో బ్రాడ్ పిట్ మూవీ రికార్డ్

మనదేశంలో ఎఫ్ 1: ది మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 42 రోజులు పూర్తి చేసుకోగా.. ఇప్పటికీ బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. విడుదలైన 6 వారాల తర్వాత కూడా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తూనే ఉన్నారు. భారత్‌లోని అతిపెద్ద స్క్రీన్లలో ఒకటైన హైదరాబాద్‌లోని పీసీఎక్స్‌లో ఆగస్ట్ 8వ తేదీన ఎఫ్ 1: ది మూవీ దాదాపు 40 శాతం ఆక్యూపెన్సీని నమోదు చేసింది. షో ప్రారంభమయ్యే నాటికి ఇది మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చిత్ర పరిశ్రమకు గుణపాఠం
42 రోజులు కావొస్తున్నా ఎఫ్ 1: ది మూవీ డిజిటల్ రిలీజ్‌పై స్పష్టత లేకపోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడటానికే మొగ్గుచూపుతున్నారు. ఈ తరహా సినిమాలను ఓటీటీ ఫ్లాట్‌ఫాంలకు దూరంగా ఉంచడం వల్ల థియేటర్స్ మేలు జరుగుతుందని.. ఎఫ్ 1 సినిమా ఓ కేస్ స్టడీగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. థియేటర్ కల్చర్‌ను నిలబెట్టడానికి చిత్ర పరిశ్రమ ముందుకు రావాలని కోరుతున్నారు.

More from Filmibeat

Read more about: brad pitt box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X