Brahma Anandam Collections: బ్రహ్మ ఆనందం కలెక్షన్లు.. బాక్సాఫీస్ లాభమెంత? నష్టమెంత?
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రతోపాటు ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన తాజా చిత్రం బ్రహ్మ ఆనందం. స్వధర్మ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రం బడ్జెట్, కలెక్షన్లు, ఇతర వివరాల్లోకి వెళితే..
కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రఘు బాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకు టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాకు నిర్మాణ వ్యయం, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కలుపుకొని ఈ మూవీని 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ప్రమోషన్స్ కోసం సుమారుగా 50 లక్షలు ఖర్చు చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 4.5 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు.

అభిరుచి గల చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాకు కమర్షియల్ వాల్యూ పెరిగింది. బ్రహ్మానందం మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ దృష్టిపడింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 2.5 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా సుమారుగా 3 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
ఇక బ్రహ్మ ఆనందం సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ సంపాదించుకొన్నది. హెల్తీ కామెడీ మూవీగా టాక్ సంపాదించుకొన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్లోగా, స్డడీగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజు 35 లక్షల రూపాయలు నికరంగా, రెండో రోజు 40 లక్షలు, మూడో రోజు 50 లక్షలు, 4వ రోజు 25 లక్షల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది.

బ్రహ్మానందం సినిమా ఐదో రోజు 11 లక్షలు, ఆరో రోజు 10 లక్షలు, ఏడో రోజు 7 లక్షలు, 8వ రోజు 4 లక్షలు, 9వ రోజు 5 లక్షలు, 10వ రోజు 4 లక్షలు వసూలు చేసింది. గత పది రోజుల్లో 1.85 కోట్ల నికర కలెక్షన్లను, 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా రాబట్టింది. దాదాపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బ్రహ్మ ఆనందం సినిమా ఇదే విధంగా రెండో వారం వరకు కలెక్షన్లు రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తుందా? అనేది కొద్ది రోజులు ఆగితే స్పష్టమవుతుంది.


Click it and Unblock the Notifications











