Brahmastra day 1 అడ్వాన్స్ బుకింగ్.. RRR రికార్డును బ్రేక్ చేసిన బ్రహ్మస్త్ర!
వివాదాలు, భారీ అంచనాల మధ్య బ్రహ్మస్త్ర చిత్రం రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్ నిర్మాతగా, ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించారు. ఈ సినిమాను దక్షిణాదిలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డిస్ట్రిబ్యూషన్ చేయడం విశేషంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన భారీగా ప్రమోషన్స్ జరగడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు సానుకూలంగా మారింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

450 కోట్ల బడ్జెట్‌తో
బ్రహ్మాస్త్ర చిత్రాన్ని అత్యధిక సాంకేతికతతో తెరకెక్కించారు. వీఎఫ్ఎక్స్‌కు పెద్ద పీట వేశారు. అమెరికాలో ఆస్కార్ గెలుచుకొన్న చిత్రాలకు పనిచేసిన సంస్థ ఈ సినిమాకు గ్రాఫిక్ వర్క్ చేసింది. ఈ చిత్రాన్ని మొత్తంగా 450 కోట్లకుపైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఆస్ట్రేలియా, ఓవర్సీస్‌లో
భారీ ప్రమోషన్ల ప్రభావంతో బ్రహ్మస్త్రం చిత్రం ఓవర్సీస్‌లో భారీగా ఒపెనింగ్స్ సాధిస్తున్నది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియాలో కూడా భారీగా అడ్వాన్సు బుకింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఈ సినిమాను ఆస్ట్రేలియాలో 89 లొకేషన్లలో 337 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమాకు సంబంధించి 4000 సీట్లు బుకింగ్ జరిగాయి. హిందీలో 3800, తెలుగు, తమిళంలో 200 టికెట్లు అమ్ముడుపోయాయి.

హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్
ఇక హైదరాబాద్‌లో కూడా భారీగా బ్రహ్మస్త్ర టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. టోటల్‌గా 370 షోలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు కోసం మొత్తం 42 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఇప్పటి వరకు 1.39 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి. ఇంకా ఒక రోజు ఉంది కనుక ఈ మొత్తం పెరిగే అవకాశం ఉంది.

హిందీ వెర్షన్‌కు భారీ ఆదరణ
బ్రహ్మస్త్ర హిందీ వెర్షన్‌కు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఉత్తరాదిలోనే కాకుండా ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్సలెంట్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 6900 షోలు ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. తొలి రోజు కోసం హిందీ వెర్షన్ 13 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. 21 శాతానికి పైగా అక్యుపెన్సీ నమోదు అయింది. బ్రహ్మస్త్ర చిత్రానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ కనిపిస్తున్నది.

RRR మూవీ రికార్డు బ్రేక్ చేసిన బ్రహ్మస్త్ర
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం RRR మూవీ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ కంటే ఎక్కువగా వసూళ్లను సాధించింది. RRR చిత్రం తొలి రోజు 7 కోట్లకుపైగా అడ్వాన్స్ బుకింగ్ సాధించింది. అయితే బ్రహ్మస్త్ర చిత్రం 13 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేయడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











