Brahmastra 400 Collections రికార్డు సృష్టించిన బ్రహ్మస్త్ర.. బాలీవుడ్‌ చరిత్రను తిరగరాసిన రణ్‌బీర్

బాలీవుడ్ అగ్రతారలు రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ రూపొందించిన బ్రహ్మస్త్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేసింది. కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత వసూళ్లను రాబట్టలేకపోతున్న హిందీ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా రికార్డు వసూళ్లను సాధించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించిన ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తూ ట్రేడ్ వర్గాల్లో జోష్ నింపింది.

తాజాగా దేశవ్యాప్తంగా నేషనల్ సినిమా డేను పాటించిన థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకుల కోసం టికెట్ రేట్లను భారీగా తగ్గించారు. దాంతో శుక్ర, శనివారాల్లో ఈ చిత్రం 23 కోట్లు రాబట్టింది. గత వారం రోజుల్లో పోల్చుకొంటే ఈ చిత్రం ఊహించని కలెక్షన్లు సాధించింది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో 104 కోట్ల రూపాయలు సాధించి ఇటీవల కాలంలో వంద కోట్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Ranbir Kapoor and Alia Bhatts Brahmastra has done good business. This movie is joined in 400 club.

ఇక బ్రహ్మస్త్ర చిత్రం దేశవ్యాప్తంగా 253 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఈ మధ్యకాలంలో ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సంచలన విజయంతోపాటు 252 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ RRR 274 కోట్ల రూపాయలను వసూలు చేయగా, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం 434 కోట్లు రాబట్టింది.

బ్రహ్మస్త్ర ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివారాల్లోకి వెళితే.. 400 కోట్ల క్లబ్‌లో చేరింది. నేషనల్ సినిమా డే సందర్భంగా మరొ 23 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 423 కోట్లు వసూలు చేసినట్టు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X