For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra Collections: తెలుగులో అన్ని కోట్ల లాభాలతో రికార్డు.. హిందీ వసూళ్లు చూస్తే షాకే!

    |

    దక్షిణాది సినిమాల స్థాయి పెరిగినప్పటి నుంచి బాలీవుడ్‌లో వచ్చే చిత్రాలకు పెద్దగా ఆదరణ లభించడం లేదు. ఇలా దాదాపు ఐదారేళ్లుగా అక్కడ బిగ్ సక్సెస్‌లు రావట్లేదు. దీంతో హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఫిల్మ్ మేకర్లు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్ హీరోగా ఎంతో మంది బడా స్టార్లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ మూవీ రికార్డు స్థాయిలో లాభాలను కూడా సొంతం చేసుకుంటోంది. కానీ, హిందీలో మాత్రం పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' వారం రోజుల రిపోర్టును చూద్దాం పదండి!

    బాలీవుడ్‌కు బ్రహ్మాస్త్రంలా మూవీ

    బాలీవుడ్‌కు బ్రహ్మాస్త్రంలా మూవీ


    రణ్‌బీర్ కపూర్ - అయాన్ ముఖర్జీ కాంబోలో రూపొందిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌ కాగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల అయింది.

    Saakini Daakini Twitter Review: రెజీనా, నివేదా మూవీకి ఊహించని టాక్.. అది కూడా వర్కౌట్ అయితే మాత్రం!

    బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    7వ రోజు తెలుగులో వసూళ్లు ఇలా

    7వ రోజు తెలుగులో వసూళ్లు ఇలా

    'బ్రహ్మాస్త్ర' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏడో రోజూ వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 30 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ: సుధీర్ మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్ అంటూ!

    వారం రోజుల్లో తెలుగు కలెక్షన్లిలా

    వారం రోజుల్లో తెలుగు కలెక్షన్లిలా


    వారం రోజులకు 'బ్రహ్మాస్త్ర' మూవీ ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 5.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.28 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 54 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో.. రూ. 11.09 కోట్లు షేర్, రూ. 21.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే


    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బ్రహ్మాస్త్ర'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 11.09 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.59 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

    బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    తెలుగులో లాభాల వర్షం కురిపించుకుంటోన్న 'బ్రహ్మాస్త్ర' మూవీ... ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి వారం రోజులకు కలిపి హిందీలో రూ. 158.98 కోట్లు, తెలుగులో రూ. 24.60 కోట్లు, తమిళంలో రూ. 7.20 కోట్లు, కర్నాటకలో రూ. 11.15 కోట్లు, కేరళలో రూ. 2.22 కోట్లు రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 204.15 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసింది.

    ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

    ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

    రణ్‌బీర్ కపూర్ - ఆలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 202 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 110 కోట్ల వరకే షేర్ వచ్చినట్లు తెలిసింది. అంటే రూ. 90 కోట్ల వరకూ రాబట్టాలి.

    English summary
    Ranbir Kapoor and Alia Bhatt Did Brahmastra Movie Under Ayan Mukerji Direction. This Movie Collects Rs 11.09 Crore in 1st Week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X