Brahmastra Collections: బ్రహ్మాస్త్ర మాస్ కొట్టుడు.. అన్ని కోట్ల టార్గెట్ ఉఫ్.. హిందీలో మాత్రం!
గతంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్ నుంచి భారీ చిత్రాలు అంతగా రావడం లేదు. వచ్చినా అవి మాత్రం మన దక్షిణాదిలో పెద్దగా ప్రభావాన్ని చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. వరుస దెబ్బలతో విలవిల్లాడుతోన్న బాలీవుడ్‌ను గట్టెంకించేందుకు వచ్చిన ఈ సినిమాకు ఆరంభంలోనే టాక్ కాస్త ఇబ్బంది పెట్టింది. అయితేనేం కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయి కంటే ఎక్కువగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లతో హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే విజయాన్ని అందుకుంటుంది? అనేవి చూద్దాం పదండి!

బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని వచ్చారుగా
రణ్‌బీర్ కపూర్ - ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల అయింది.

బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ చేసుకుంది.

తెలుగు రెండో రోజు వసూళ్లు ఇలా
'బ్రహ్మాస్త్ర' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 30 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 27 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 13 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రూ. 2.62 కోట్లు షేర్, రూ. 5.05 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

రెండు రోజుల్లో తెలుగు కలెక్షన్లిలా
2 రోజులకు 'బ్రహ్మాస్త్ర' మూవీ ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 3.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 66 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో.. రూ. 6.30 కోట్లు షేర్, రూ. 11.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'బ్రహ్మాస్త్ర'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 6.30 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 80 లక్షలు లాభాలు కూడా వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?
తెలుగులో రెండు రోజుల్లోనే హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న 'బ్రహ్మాస్త్ర' మూవీ... ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.42 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే, రెండో రోజు రూ. 41.50 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో దీనికి రూ. 77.92 కోట్లు నెట్‌తో పాటు రూ. 100 కోట్లుకు పైగా గ్రాస్ కూడా వసూలు అయింది.

ఓవర్సీస్‌లో సత్తా చాటిన మూవీ
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీకి ఓవర్సీస్‌లో కూడా అదిరిపోయే స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ సినిమా అక్కడ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రీమియర్స్ ద్వారా 500k డాలర్లు వసూలు చేసిన ఈ మూవీ.. మొదటి రోజు 1.5 మిలియన్ డాలర్లు, రెండో రోజు 1 మిలియన్ వసూలు చేసింది. ఇలా మొత్తంగా రెండు రోజుల్లో దాదాపు 3 మిలియన్స్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











