twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra Collections: తెలుగులో బ్రహ్మాస్త్ర సంచలనం.. ఓవరాల్‌గా అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!

    |

    గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చాలా వెనుకబడిపోయిందని చెప్పొచ్చు. అక్కడ చిత్రాల స్థాయి తగ్గకున్నా.. దక్షిణాది మూవీల రేంజ్ పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు హిందీ ఫిల్మ్ మేకర్లు భారీ చిత్రాలను రూపొందిస్తోన్నారు. కానీ, సరైన ఫలితాలను మాత్రం రాబట్టుకోలేకపోతోన్నారు.

    ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే విడుదలైన బిగ్ బాలీవుడ్ మూవీనే 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ మూవీ రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసింది అనేది చూద్దాం పదండి!

    ‘బ్రహ్మాస్త్రం'తో వచ్చిన బాలీవుడ్

    ‘బ్రహ్మాస్త్రం'తో వచ్చిన బాలీవుడ్

    రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్‌ కాగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ అయింది.

    డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

    బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

    తెలుగు ఆరో రోజు వసూళ్లు ఇలా

    తెలుగు ఆరో రోజు వసూళ్లు ఇలా

    'బ్రహ్మాస్త్ర' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆరో రోజు వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 46 లక్షలు షేర్, రూ. 92 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

    శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చశృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

    ఆరు రోజుల్లో తెలుగు కలెక్షన్లిలా

    ఆరు రోజుల్లో తెలుగు కలెక్షన్లిలా

    6 రోజులకు 'బ్రహ్మాస్త్ర' మూవీ ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 5.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.24 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 82 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 91 లక్షలు, కృష్ణాలో రూ. 54 లక్షలు, నెల్లూరులో రూ. 36 లక్షలతో.. రూ. 10.79 కోట్లు షేర్, రూ. 20.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

     టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

    భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బ్రహ్మాస్త్ర'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 10.79 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.29 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

    Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'బ్రహ్మాస్త్ర' మూవీ... ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి ఆరు రోజులకు కలిపి హిందీలో రూ. 149.88 కోట్లు, తెలుగులో రూ. 23.80 కోట్లు, తమిళంలో రూ. 7 కోట్లు, కర్నాటకలో రూ. 10.70 కోట్లు, కేరళలో రూ. 2.12 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 193.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

    ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

    ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

    'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 202 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 100 కోట్ల వరకే షేర్ వచ్చినట్లు విశ్లేషకులు వెల్లడించారు. అంటే ఇంకా సగం పైన వస్తేనే ఇది లాభాల్లోకి వెళుతుంది.

    English summary
    Ranbir Kapoor and Alia Bhatt Did Brahmastra Movie Under Ayan Mukerji Direction. This Movie Collects Rs 10.79 Crore in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X