twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra Collections: తెలుగులో లాభాలతో రికార్డు.. హిందీలో షాకింగ్‌గా.. ఇంకెన్ని కోట్లు రావాలంటే!

    |

    తెలుగు సినిమా సత్తా పెరిగిన తర్వాత బాలీవుడ్‌లో రూపొందే చిత్రాలకు ఆదరణ క్రమంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ అక్కడ ఎన్నో పాన్ ఇండియా స్థాయి మల్టీ లాంగ్వేజ్ మూవీలు రూపొందుతోన్నాయి. కానీ, దురదృష్టవశాత్తు అవి పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమానే 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో ఎంతో మంది ప్రముఖులు నటించిన ఈ సినిమాకు టాక్ అనుకున్న రేంజ్‌లో రాలేదు.

    కానీ, తెలుగులో కలెక్షన్లు మాత్రం పోటెత్తాయి. అయితే, హిందీలో మాత్రం వసూళ్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' ఎనిమిది రోజుల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

    బ్రహ్మాస్త్ర మూవీలో ఎవరెవరున్నారు

    బ్రహ్మాస్త్ర మూవీలో ఎవరెవరున్నారు

    రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌ కాగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ అయింది.

    దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

    బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

    8వ రోజు తెలుగులో వసూళ్లు ఇలా

    8వ రోజు తెలుగులో వసూళ్లు ఇలా

    'బ్రహ్మాస్త్ర' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8వ రోజూ వసూళ్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 8 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 17 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ మాత్రమే వసూలు అయింది.

    బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!బెడ్‌పై ఈషా రెబ్బా అందాల ఆరబోత: నెట్ డ్రెస్‌లో మొత్తం కనిపించేలా!

    8రోజులకు కలిపి తెలుగు కలెక్షన్లు

    8రోజులకు కలిపి తెలుగు కలెక్షన్లు

    8 రోజులకు 'బ్రహ్మాస్త్ర' మూవీ ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 5.38 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.26 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.30 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో.. రూ. 11.26 కోట్లు షేర్, రూ. 21.32 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

     టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

    టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

    భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బ్రహ్మాస్త్ర'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 11.26 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.76 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

    బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?


    తెలుగులో లాభాల పంట పండిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' మూవీ... ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 8 రోజుల్లో హిందీలో రూ. 169.68 కోట్లు, తెలుగులో రూ. 25.30 కోట్లు, తమిళంలో రూ. 7.50 కోట్లు, కర్నాటకలో రూ. 11.85 కోట్లు, కేరళలో రూ. 2.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 87 కోట్లు రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 303.65 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసింది.

    ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

    ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

    రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 202 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 150 కోట్ల వరకే షేర్ వచ్చినట్లు తెలిసింది. అంటే రూ. 50 కోట్ల వరకూ వస్తేనే హిట్ అవుతుంది.

    English summary
    Ranbir Kapoor and Alia Bhatt Did Brahmastra Movie Under Ayan Mukerji Direction. This Movie Collects Rs 11.26 Crore in 8 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X