For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Brahmastra Collections: తెలుగులో సెన్సేషనల్ రికార్డు.. హిందీలో పరిస్థితి ఇది.. మరో 10 కోట్లు వస్తే!

  |

  చాలా కాలంగా బాలీవుడ్‌లో వచ్చే సినిమాలకు ఎందుకనో పెద్దగా ఆదరణ లభించడం లేదు. అక్కడ స్టార్లుగా వెలుగొందుతోన్న ఎంతో మంది వరుసగా మూవీలు చేస్తున్నా నిరాశే ఎదురవుతోంది. ఈ ఏడాది కూడా పలువురు బడా హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అవన్నీ అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే విడుదలైన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'.

  రణ్‌బీర్ కపూర్ హీరోగా కొందరు స్టార్లు కూడా నటించిన ఈ చిత్రానికి అనుకున్న రేంజ్‌లో టాక్ రాలేదు. దీంతో కలెక్షన్లపై ప్రభావం అయితే పడింది. కానీ, తెలుగులో మాత్రం ఈ మూవీ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' మూవీ 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూద్దాం పదండి!

  బ్రహ్మాస్త్ర సినిమా వివరాలు ఇవే

  బ్రహ్మాస్త్ర సినిమా వివరాలు ఇవే

  రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌ కాగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది.

  Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

  బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

  బ్రహ్మాస్త్ర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

  అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్‌ను చేసుకుంది.

  9వ రోజు తెలుగులో వసూళ్లు ఇలా

  9వ రోజు తెలుగులో వసూళ్లు ఇలా

  'బ్రహ్మాస్త్ర' సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9వ రోజు వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 12 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. రూ. 25 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్‌ వసూలు అయింది.

  బీచ్‌లో దారుణంగా అమలా పాల్: ఆ డ్రెస్ ఏంటి? ఆ ఫోజులేంటి బాబోయ్!

  9రోజులకు కలిపి తెలుగు కలెక్షన్లు

  9రోజులకు కలిపి తెలుగు కలెక్షన్లు

  'బ్రహ్మాస్త్ర' మూవీ 9 రోజులకు ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 5.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.29 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 88 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, గుంటూరులో రూ. 98 లక్షలు, కృష్ణాలో రూ. 58 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో.. రూ. 11.51 కోట్లు షేర్, రూ. 21.82 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

  టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

  టార్గెట్ ఎంత? లాభం ఎంతంటే

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'బ్రహ్మాస్త్ర'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 11.51 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.01 కోట్లు లాభాలతో రికార్డు సాధించింది.

  తెలుగు పిల్ల ఎద అందాల జాతర: చీర ఉన్నా పరువాలు దాగట్లేదుగా!

   ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

  ఏపీ, తెలంగాణలో లాభాలను అందుకున్న 'బ్రహ్మాస్త్ర'.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 9 రోజుల్లో హిందీలో రూ. 184.28 కోట్లు, తెలుగులో రూ. 26.80 కోట్లు, తమిళంలో రూ. 8.00 కోట్లు, కర్నాటకలో రూ. 13.25 కోట్లు, కేరళలో రూ. 2.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 90 కోట్లు రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 324.80 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసింది.

   ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

  ఓవరాల్‌గా హిట్ అవ్వాలంటే?

  పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రూ. 202 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. కానీ, ఇప్పటి వరకూ దీనికి రూ. 160 కోట్ల వరకే షేర్ వచ్చినట్లు తెలిసింది. అంటే రూ. 40 కోట్ల వరకూ వస్తేనే హిట్ అవుతుంది.

  English summary
  Ranbir Kapoor and Alia Bhatt Did Brahmastra Movie Under Ayan Mukerji Direction. This Movie Collects Rs 11.51 Crore in 9 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X