For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Brahmastra USA Collections: బ్రహ్మాస్త్ర సంచలనం.. అమెరికాలో ఒక్కరోజే అన్ని కోట్లు.. తొలి మూవీగా రికార్డు

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ చాలా వెనుకబడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం దక్షిణాది చిత్రాలు దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిండమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల హిందీ చిత్ర పరిశ్రమ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, అవేమీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ మూవీనే 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో శుక్రవారమే విడుదలైంది. అయితే, దీనికి అనుకున్న రేంజ్‌లో టాక్ రాకున్నా.. కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు మాత్రం పోటెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 'బ్రహ్మాస్త్ర' ఓ అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  బాలీవుడ్‌కు బ్రహ్మాస్త్రంగా వచ్చింది

  బాలీవుడ్‌కు బ్రహ్మాస్త్రంగా వచ్చింది

  రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఆయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. ఈ చిత్రానికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయింది.

  స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

  భారీ అంచనాలు.. రిలీజ్ గ్రాండ్‌గా

  భారీ అంచనాలు.. రిలీజ్ గ్రాండ్‌గా

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికితోడు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే 'బ్రహాస్త్ర' మూవీని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.

  భారీ రెస్పాన్స్‌తో... పండగ సందడి

  భారీ రెస్పాన్స్‌తో... పండగ సందడి

  బాలీవుడ్‌లోని పలువురు స్టార్లు కలిసి నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా.. సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని చోట్లా పండుగ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి బాలీవుడ్‌కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని చెప్పుకోవచ్చు.

  Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

  అమెరికాలో మరింత ఎక్కువ క్రేజ్‌

  అమెరికాలో మరింత ఎక్కువ క్రేజ్‌

  మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'బ్రహ్మాస్త్ర' మూవీ సందడి మరింత ముందు నుంచే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ముందుగానే ఓపెన్ అయ్యాయి. దీనికితోడు బాలీవుడ్ అభిమానులు ఈ చిత్రం కోసం ముందు నుంచే ఆసక్తిని చూపించారు. దీంతో యూఎస్ సహా ఎన్నారైలు ఎక్కువున్న దేశాల్లో దీనికి క్రేజ్ భారీగా పెరిగింది.

  ప్రీమియర్స్‌తో ఆ మార్కును దాటి

  ప్రీమియర్స్‌తో ఆ మార్కును దాటి

  ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఓవర్సీస్‌లో 'బ్రహ్మాస్త్ర' మూవీ బుకింగ్స్ ముందుగానే ప్రారంభం అయ్యాయి. అక్కడ ప్రీమియర్స్‌ సహా మొదటి రోజు టికెట్లు కూడా ఎప్పుడో బుక్ అయిపోయాయి. దీంతో అక్కడ ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక, ప్రీమియర్స్‌తో ఈ సినిమా 500k డాలర్ల మార్కును దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

  టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

  మొదటి రోజే సంచలన వసూళ్లతో

  మొదటి రోజే సంచలన వసూళ్లతో

  ప్రీమియర్స్ ద్వారానే హాఫ్ మిలియన్ డాలర్లకు పైగానే వసూలు చేసిన 'బ్రహ్మాస్త్ర' మూవీ.. మొదటి రోజు కూడా అదిరిపోయే స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా ఒక మిలియన్ డాలర్లకు పైగానే కలెక్షన్లను రాబట్టింది. దీంతో మొత్తంగా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకుని 1.70 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. అంటే రూ. 13 కోట్లు వసూళ్లను రాబట్టింది.

  ఇండియాలో ఫస్ట్ మూవీగా రికార్డు

  ఇండియాలో ఫస్ట్ మూవీగా రికార్డు


  ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో చాలా సినిమాలు విడుదలయ్యాయి. కానీ, దేనికీ యూఎస్‌లో ఈ తరహా రెస్పాన్స్ రాలేదు. ఇక, 'బ్రహ్మాస్త్ర' అప్పుడే అక్కడ 1.70 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో ఈ ఏడాది ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్లలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన బాలీవుడ్‌ మూవీగా ఇది రికార్డును క్రియేట్ చేసింది. దీనిపై బాలీవుడ్ వర్గాలు ఖుషీ అవుతున్నాయి.

  English summary
  Ranbir Kapoor and Alia Bhatt Did Brahmastra Movie Under Ayan Mukerji Direction. This Movie Cross 1 Million Mark at US Box Office in Day 1.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X