Brahmastra day 1 collections worldwide..దుమ్మురేపుతున్న బాక్సాఫీస్ రిపోర్ట్..తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంట

హిందీ సినీ పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహర్ రూపొందించిన బ్రహ్మస్త్ర సినిమా పాజిటివ్‌గా బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. గత కొద్ది నెలలుగా దారుణమైన వసూళ్లను సాధిస్తున్న బాలీవుడ్‌కు ఈ చిత్రం కొత్త ఊపిరి పోసినట్టయింది. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ నటించిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

1.3 లక్షల టికెట్ల అమ్మకం

1.3 లక్షల టికెట్ల అమ్మకం


ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేయడం బ్రహ్మస్త్ర మూవీకి మంచి కలిసివచ్చింది. దాంతో అడ్వాన్స్ బుకింగ్‌ భారీగా నమోదైంది. పీవీఆర్, ఐనాక్స్, సినిప్లెక్స్ లాంటి మల్టీప్లెక్స్‌లో దాదాపు 1.3 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇటీవల కాలంలో ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్ నమోదు కావడం బాలీవుడ్‌లో ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

 23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్

23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్


బ్రహ్మస్త్ర చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం 23 కోట్లు రాబట్టింది. ఈ అడ్వాన్స్ బుకింగ్‌లో శుక్రవారం నాటి కలెక్షన్లు కూడా ఉండటం గమనార్హం. అంతేకాకుండా తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ 1 కోట్లు రాబట్టడం విశేషంగా మారింది.

 దేశంలోని ప్రధాన నగరాల్లో అక్యుపెన్సీ

దేశంలోని ప్రధాన నగరాల్లో అక్యుపెన్సీ


ఇక బ్రహ్మస్త్ర మొదటి రోజు థియేట్రికల్ అక్యుపెన్సీ విషయానికి వస్తే.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఓ మోస్తారుగా నమోదైంది. ముంబైలో 35 శాతం, ఢిల్లీలో 37 శాతం, పూణెలో 37 శాతం, బెంగళూరులో 33 శాతం, కోల్‌కతాలో 33 శాతం, ఆహ్మదాబాద్‌లో 25 శాతం, చెన్నైలో 61 శాతం, సూరత్‌లో 36 శాతం, జైపూర్‌లో 36 శాతం, చండీగఢ్‌లో 31 శాతం, భూపాల్‌లో 29 శాతం, లక్నోలో 32 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ

తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ


బ్రహ్మస్త్ర తెలుగు 3డీ వెర్షన్ అక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 77 శాతం, విజయవాడలో 55 శాతం, వరంగల్‌లో 84 శాతం, గుంటూరులో 70 శాతం, వైజాగ్‌లో 91 శాతం, నిజమాబాద్‌లో 75 శాతం, కరీంనగర్‌లో 37 శాతం, కాకినాడలో 90 శాతం, రాజమండ్రిలో 53 శాతం, తిరుపతిలో 89 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?


బ్రహ్మస్త చిత్రానికి వినాయక నిమజ్జనం కాస్త ప్రతికూలంగా మారింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వసూళ్లు కలిపి సుమారు 30 నుంచి 33 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మస్త్ర చిత్రం అన్ని భాషల్లో కలిపి 35 నుంచి 40 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

లాభాల్లోకి బ్రహ్మస్త్ర రావాలంటే..

లాభాల్లోకి బ్రహ్మస్త్ర రావాలంటే..


బ్రహ్మస్త్ర సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఈ చిత్రానికి దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ కోసమే 60 కోట్లకుపైగా వెచ్చించారు. కోవిడ్, ఇతర అంశాలు ఈ సినిమాపై భారీగా బడ్జెట్ భారాన్ని మోపాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ కనిపించడం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు అందుబాటులో లేవు కనుక.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత అనేది సందేహంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X