twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra Telugu Collections: తెలుగులో బ్రహ్మాస్త్ర రికార్డు.. అన్ని కోట్ల వసూళ్లతో కొత్త చరిత్ర

    |

    దేశంలోని మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ స్టామినా గణంగా పెరిగిందనే చెప్పుకోవాలి. అందుకే మన సినిమాలే దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతున్నాయి. దీంతో తెలుగు మార్కెట్‌పై అన్ని ఇండస్ట్రీల హీరోలు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే మన దగ్గర కూడా ఎంతో గ్రాండ్‌గా తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇలా తాజాగా విడుదలైన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే మొదటి రోజు స్పందనను అందుకుంది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే దక్కాయి. ఈ నేపథ్యంలో 'బ్రహ్మస్త్ర' మొదటి రోజు రిపోర్టును చూద్దాం పదండి!

    బ్రహ్మాస్త్ర అంటూ వచ్చేశారుగా

    బ్రహ్మాస్త్ర అంటూ వచ్చేశారుగా

    రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రమే 'బ్రహ్మాస్త్ర'. ఆలియా భట్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. ఈ చిత్రానికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది ఐదు భాషల్లో విడుదలైంది.

    స్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శనస్విమ్మింగ్ పూల్‌లో బిగ్ బాస్ భామ రచ్చ: తడిచిన బట్టల్లో అందాల ప్రదర్శన

    అన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    అన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

    క్రేజీ సబ్జెక్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్ చేసుకుంది.

    భారీ రెస్పాన్స్‌... వసూళ్లు కూడా

    భారీ రెస్పాన్స్‌... వసూళ్లు కూడా

    భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'బ్రహ్మాస్త్ర' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా.. సమయంలో థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. దీంతో అన్ని ఏరియాల్లోనూ దీనికి స్పందన దక్కింది. దీంతో భారీ కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు అంచనాలు వేశారు.

    Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!Bigg Boss Telugu 6: ఆ అమ్మాయికి బిగ్ బాస్ షాక్.. పిరియడ్స్‌తో ఇబ్బంది.. రిక్వెస్ట్ చేసినా వినకుండా!

    తెలుగులో మొదటి రోజు ఇలా

    తెలుగులో మొదటి రోజు ఇలా

    'బ్రహ్మాస్త్ర' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.85 కోట్లు, సీడెడ్‌లో రూ. 42 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 15 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి రూ. 3.68 కోట్లు షేర్, రూ. 6.70 కోట్లు గ్రాస్ వసూలైంది.

    టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

    టార్గెట్ ఇలా... ఎంత రావాలి?

    బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర'కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజే దీనికి భారీ స్థాయిలో రూ. 3.68 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.82 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ అందుకుంటుంది.

    టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!టాప్ కిందకి జరిపి షాకిచ్చిన శ్యామల: ఇది అట్టాంటిట్టాంటి షో కాదుగా!

    తెలుగులో బ్రహ్మాస్త్ర సెన్సేషన్

    తెలుగులో బ్రహ్మాస్త్ర సెన్సేషన్

    విజువల్ వండర్‌గా వచ్చిన 'బ్రహ్మాస్త్ర' మూవీకి తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజే ఇది రూ. 6.70 కోట్లు గ్రాస్ రాబట్టింది. దీంతో ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ గ్రాస్ రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డును నెలకొల్పింది. గతంలో ఈ ఘనత అమీర్ ఖాన్ నటించిన 'ధూమ్ 3' పేరిట ఉండేది. ఆ చిత్రం రూ. 4.70 కోట్ల గ్రాస్‌ను రాబట్టగా.. అది బ్రేక్ అయింది.

    English summary
    Ranbir Kapoor and Alia Bhatt Did Brahmastra Movie Under Ayan Mukerji Direction. This Movie Collects Rs 3.68 Crore in Day 1.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X