Brahmastra day 1 collections worldwide.. అమీర్ ఖాన్ ధూమ్ 3 రికార్డు బ్రేక్.. 100 కోట్లపై కన్నేసిన బ్రహ్మస్త్ర!

బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో, ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, అతిథి పాత్రలో షారుక్ ఖాన్ నటించిన బ్రహ్మస్త్ర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనంగా కలెక్షన్ల యాత్రను ప్రారంభించింది. జవానీ హై దీవానీ ఫేమ్ ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్‌కు కొత్త ఊపిరిపోసినట్టయింది. లాక్‌డౌన్ తర్వాత సంక్షోభంలో మునిగిపోయిన హిందీ చిత్రసీమకు బ్రహ్మస్త్ర జోష్‌ను పెంచింది. ఈ నేపథ్యంలో బ్రహ్మస్త్ర తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కంటెంట్ కంటే గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం

కంటెంట్ కంటే గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం

బ్రహ్మస్త్ర చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజైంది. భారత్‌తోపాటు ఇతర దేశాల్లో కలిపి మొత్తం 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఇటీవల కాలంలో ఏ హిందీ సినిమాకు రానటువంటి రెస్పాన్స్ ఈ సినిమాకు కనిపించింది. గ్రాఫిక్స్‌ కోసం దాదాపు 60 కోట్లకుపైగా వెచ్చించి ఈ సినిమాను ఆకట్టుకొనేలా చేశారు. అయితే కంటెంట్ కంటే గ్రాఫిక్స్‌ డామినేట్ చేశాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కర్ణాటక, తమిళ, కేరళలో కలెక్షన్లు

కర్ణాటక, తమిళ, కేరళలో కలెక్షన్లు

దక్షిణాదిలో బ్రహ్మస్త్ర సినిమా విషయానికి వస్తే.. కర్ణాటకలో వర్షాలను సైతం లెక్క చేయకుండా ఈ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. బెంగళూరులో 270 షోలు, మైసూరులో 32 షోలు, మంగళూరులో 30 షోలు ప్రదర్శించారు. ఈ సినిమా తొలి రోజున కర్ణాటకలో 1.2 షేర్, 2.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక తమిళనాడులో 1.55 కోట్ల గ్రాస్, మలయాళంలో 55 లక్షల వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగేతర రాష్ట్రాల్లో 4.5 కోట్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బ్రేక్ వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బ్రేక్ వసూళ్లు


తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మస్త్ర చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను 5 కోట్లకు అమ్మడం జరిగింది. దాంతో ఈ సినిమా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే తొలి రోజే ఈ చిత్రం 6.7 కోట్ల గ్రాస్‌, 3.7 కోట్ల షేర్‌ను రాబట్టడం సంచలనంగా మారింది.

ఆంధ్రా, నైజాంలో ధూమ్ రికార్డు బ్రేక్

ఆంధ్రా, నైజాంలో ధూమ్ రికార్డు బ్రేక్

తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మస్త్ర చిత్రం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. బాలీవుడ్‌కు చెందిన సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బ్రహ్మస్త్ర ఘనతను సొంతం చేసుకొన్నది. గతంలో ధూమ్ 3 సాధించిన 4.7 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇంకా ఈ చిత్రం 1.8 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. ఇటీవల కాలంలో తొలి వారాంతానికే లాభాల్లో చేరిన మరో చిత్రంగా బ్రహ్మస్త్ర రికార్డును క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది.

100 కోట్లపై కన్నేసిన రణ్‌బీర్, ఆలియా మూవీ

100 కోట్లపై కన్నేసిన రణ్‌బీర్, ఆలియా మూవీ

ఇక బ్రహ్మస్త్ర ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 34 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 75 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదుచేసింది. వినాయక నిమజ్జనం కారణంగా ఈ చిత్రం వసూళ్లు తగ్గాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. శనివారం, ఆదివారాల్లో ఈ చిత్రం వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ఈ వారాంతం లోపే బ్రహ్మస్త్ర 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X