twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra day 2 collections రికార్డు దిశగా బ్రహ్మస్త్ర.. బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్న రణ్‌బీర్, ఆలియా

    |

    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మస్త్ర చిత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను రఫ్ ఆడిస్తున్నది. అమితాబ్, నాగార్జున, షారుక్ ఖాన్, రణ్‌బీర్, ఆలియా నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ వైబ్స్‌తో ముందుకెళ్తున్నది. తొలి రోజు భారీగా 75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం అదే జోష్‌ను రెండో రోజు కొనసాగించడం ట్రేడ్ వర్గాల్లో సంబరాలు కనిపిస్తున్నాయి. రెండో రోజు బ్రహ్మాస్త్ర కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    తొలి రోజు ఇండియాలో 41 కోట్ల షేర్

    తొలి రోజు ఇండియాలో 41 కోట్ల షేర్


    బ్రహ్మాస్త్ర చిత్రం దేశంలోని వివిధ భాషల్లో సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. హిందీలో ఈ చిత్రం 32 కోట్ల షేర్, తెలుగులో 3.7 కోట్ల షేర్; కర్ణాటకలో 10 లక్షల షేర్, తమిళనాడులో 7 లక్షల షేర్, మలయాళంలో 1 లక్షషేర్ సాధించింది. దాంతో ఈచిత్రం ఇండియాలో 41 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

    ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న బ్రహ్మాస్త్ర

    ఓవర్సీస్‌లో దుమ్మురేపుతున్న బ్రహ్మాస్త్ర


    ఓవర్సీస్‌లో బ్రహ్మస్త్ర కలెక్షన్లు భారీగా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో తొలి రోజు 111 లొకేషన్లలో 305085 డాలర్లు వసూలు చేసింది. న్యూజిలాండ్‌లో 32 లొకేషన్లలో 55747 డాలర్లను రాబట్టింది. ఇక రెండో రోజు 160K ఆస్ట్రేలియా డాలర్లను ఇప్పటికే రాబట్టింది. అమెరికాలో తొలి రోజు, ప్రీమియర్ల మొత్తం కలిపి 1 మిలియన్ డాలర్లను రాబట్టింది. తొలి వారాంతానికి అమెరికా, కెనడాలో 3.4 మిలియన్ డాలర్లను వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఆస్ట్రేలియాలో వారాంతానికి 1.75 మిలియన్ డాలర్లను రాబట్టే అవకాశం ఉంది.

    రెండో రోజు వివిధ రాష్ట్రాల్లో అక్యుపెన్సీ

    రెండో రోజు వివిధ రాష్ట్రాల్లో అక్యుపెన్సీ


    ఇక రెండో రోజు బ్రహ్మస్త్ర చిత్రం హిందీ వెర్షన్ ఓవరాల్‌గా 40 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. ముంబైలో 47 శాతం, ఢిల్లీలో 60 శాతం, పూణెలో 54 శాతం, బెంగళూరులో 49 శాతం, హైదరాబాద్‌లో 56 శాతం, కోల్‌కతాలో 44 శాతం, ఆహ్మాదాబాద్‌లో 39 శాతం, చెన్నైలో 79 శాతం, సూరత్‌లో 25 శాతం, జైపూర్‌లో 42 శాతం, చండీగఢ్‌లో 52 శాతం, భూపాల్‌లో 48 శాతం, లక్నోలో 36 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది.

    తెలుగులో రెండో రోజు ఆక్యుపెన్సీ

    తెలుగులో రెండో రోజు ఆక్యుపెన్సీ


    బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ అక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 43 శాతం, బెంగళూరులో 23 శాతం, విజయవాడలో 25 శాతం, వరంగల్‌లో 5 శాతం, గుంటూరులో 67 శాతం, వైజాగ్‌లో 48 శాతం, ఢిల్లీలో 22 శాతం, మహబూబ్ నగర్‌‌లో 50 శాతం, కాకినాడలో 99 శాతం, రాజమండ్రిలో 30 శాతం, నెల్లూరులో 43 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది.

    రెండో రోజు దేశవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

    రెండో రోజు దేశవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా


    ఇక బ్రహ్మస్త్ర రెండో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. హిందీలో 37.5 కోట్ల గ్రాస్, తెలుగులో 3 కోట్ల గ్రాస్, తమిళనాడులో 1 కోటి గ్రాస్‌తో ఇండియా వైడ్ 49 కోట్ల గ్రాస్‌ను 41 కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం రెండో రోజున ఇండియావ్యాప్తంగా దాంతో ఇండియాలోనే ఈ చిత్రం 82 కోట్ల వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా


    ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే.. బ్రహ్మాస్త్ర చిత్రం రెండో రోజు 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు నమోదు చేయడానికి ఛాన్స్ కనిపిస్తున్నది. ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నా దానిని ఎదిరించి భారీ వసూళ్లను రాబడుతున్నది.

    English summary
    Brahmastra movie good start at world box office. Here is the day 2 expected collections are 49 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X