Brahmastra day 3 collections.. బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ మ్యాజిక్.. 150 కోట్ల దిశగా పరుగు.. మూడు రోజుల్లో ఎంతంటే?

బ్రహ్మస్త్ర చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నది. తొలి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ ఈ చిత్రం వసూళ్ల పరంగా వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. నెగిటివ్ రివ్యూలను, బాయ్ కాట్ పిలుపులను పక్కన పెట్టి ప్రేక్షకులు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్, ఆలియా భట్ నటించిన ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌వైపు పరుగులు పెట్టింది. ఈ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కంటెంట్ తక్కువ.. గ్రాఫిక్స్ ఎక్కువ

కంటెంట్ తక్కువ.. గ్రాఫిక్స్ ఎక్కువ

బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించి.. కంటెంట్ పరంగా వీక్.. కానీ గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. షారుక్, అమితాబ్, నాగార్జున లాంటి సినీ ప్రముఖులు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారారు. పాటలు, వీఎఫ్ఎక్స్ అంశాలు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

3డీ, ఐమాక్స్ వెర్షన్లకు బ్రహ్మరథం

3డీ, ఐమాక్స్ వెర్షన్లకు బ్రహ్మరథం

బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన 3డీ, ఐమాక్స్ 3డీ వెర్షన్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆదివారం రోజున 2డీ వెర్షన్‌కు కూడా మంచి రెస్పాన్స్ కనిపించింది. దేశవ్యాప్తంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్లలో బ్రహ్మస్త్రకు భారీ కలెక్షన్లు పొటేత్తాయి. దాంతో కలెక్షన్ల వర్షం ఈ సినిమాపై ప్రేక్షకులు కురిపిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ లాభాలు

తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మస్త్ర చిత్రం భారీగా వసూళ్లను రాబడుతున్నది. రెండో రోజే ఈ చిత్రం 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యాన్ని అధిగమించింది. తొలి రోజు 3.7 కోట్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు 2.3 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక మూడో రోజు కూడా 3 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది. దక్షిణాదిలో ఈ చిత్రం మొత్తంగా 16 కోట్లు వసూలు చేసింది.

మూడో రోజు దేశవ్యాప్తంగా

మూడో రోజు దేశవ్యాప్తంగా

ఇటీవల కాలంలో ఏ బాలీవుడ్ సినిమా సాధించలేని రికార్డులను బ్రహ్మస్త్ర క్రియేట్ చేస్తున్నది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు దేశవ్యాప్తంగా హిందీ, దక్షిణాది భాషల్లో 37 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 41 కోట్లు రాబట్టడంతో ఇండియాలోనే 78 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది.

ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు

ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు

అమెరికాతోపాటు ఓవర్సీస్‌‌లో బ్రహ్మస్త్ర దుమ్ముదులుపుతున్నది. ఈ చిత్రం తొలి రోజున 3.4 మిలియన్ డాలర్లు, రెండో రోజున 3.8 మిలియన్ డాలర్లు, మూడో రోజున 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో గత మూడు రోజుల్లో మొత్తంగా 11.7 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు

ఇక ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 45 కోట్లు నమోదు చేసింది. గత మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 128 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజున 75 కోట్లు, రెండో రోజున 85 కోట్లు మూడో రోజున 90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇదే ఊపు కొనసాగిస్తే.. తొలివారం తర్వాత 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

150 కోట్ల క్లబ్‌లోకి బ్రహ్మస్త్ర

150 కోట్ల క్లబ్‌లోకి బ్రహ్మస్త్ర


బ్రహ్మస్త్ర చిత్రం మూడో రోజు కూడా అదే ఊపును బాక్సాఫీస్ వద్ద కొనసాగించింది. దేశవ్యాప్తంగా 45 నుంచి 50 శాతం అక్యుపెన్సీని నమోదు చేసింది. సోమవారం కూడా బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 4వ రోజున 150 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X