twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmastra day 4 collections.హాలీవుడ్‌లో రికార్డులు బ్రేక్..బ్రాడ్‌పిట్ మూవీ కంటే బ్రహ్మస్త్రకు ఎక్కువ వసూళ్లు

    |

    దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాల అంచనాలను మించి బ్రహ్మస్త్ర చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. గత మూడు రోజులు భారీ వసూళ్లు చేపట్టిన ఈ చిత్రం సోమవారం అగ్ని పరీక్షను దాటుకొని ఓ మోస్తారు కలెక్షన్లను నమోదు చేసింది. ప్రతీ సినిమాకు తొలివారాంతం తర్వాత వచ్చే సోమవారమే సినిమా బలాన్ని బాక్సాఫీస్ వద్ద రుజువు చేస్తుంది. ఆ విఘ్నాన్ని అధిగమించిందనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్నది. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన ఈ చిత్రం 4వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందంటే..

    గత మూడు రోజుల్లో

    గత మూడు రోజుల్లో

    బ్రహ్మస్త్ర చిత్రం గత మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 128 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజున 75 కోట్లు, రెండో రోజున 85 కోట్లు మూడో రోజున 90 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ వసూళ్లను, 128 కోట్ల షేర్ నమోదు చేసింది.

    నాలుగో రోజున యావరేజ్ కంటే..

    నాలుగో రోజున యావరేజ్ కంటే..

    బ్రహ్మస్త్ర చిత్రం సోమవారం రోజున భారీ వసూళ్లను రాబట్టలేకపోయినా నిలకడగా కలెక్షన్లను నమోదు చేసింది. సోమవారం వర్కింగ్ డే కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం 20 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. అయితే 3డీ, ఐమాక్స్ 3డీ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నై, ఢిల్లీలో ఈ సినిమాకు భారీ అక్యుపెన్సీ కనిపించింది.

    యూఎస్ఏలో రికార్డుల మోత

    యూఎస్ఏలో రికార్డుల మోత

    ఇక బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించి 4వ రోజు అమెరికా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 4,381,701 డాలర్లను రాబట్టింది. తొలి రోజున ప్రీమియర్లుతో 1 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆదివారం రోజున మరో మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం 4వ రోజున 30k డాలర్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 4,410,701 డాలర్లను వసూలు చేసింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద బ్రాడ్ పిట్ నటించిన బుల్లెట్ ట్రైన్, సూపర్ పెట్స్ సినిమా కలెక్షన్ల కంటే ఎక్కువగా బ్రహ్మస్త్ర మూవీ వసూళ్లను రాబట్టింది.

    నాలుగో రోజు హిందీ వెర్షన్

    నాలుగో రోజు హిందీ వెర్షన్


    ఇక హిందీ వెర్షన్ బ్రహ్మస్త్ర సినిమా విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 16 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలి రోజున 36.5, రెండో రోజున 42.5, మూడో రోజున 45.5 కోట్లు వసూలు చేసింది. 110 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో మూడు రోజుల్లోనే 100 కోట్లు సాధించిన చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

    4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో

    4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో


    ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. అయితే ఈ చిత్రం నాలుగు రోజున కోటి రూపాయల షేర్‌ను సాధించింది. తొలి రోజున ఈ చిత్రం 3.68, రెండో రోజున 2.62, మూడో రోజున 2.19 కోట్లు, నాలుగో రోజున 1 కోటి వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 9.49 కోట్ల షేర్, 17 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

    తెలుగేతర రాష్ట్రాల్లో

    తెలుగేతర రాష్ట్రాల్లో

    ఇక తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళనాడులో నాలుగో రోజు 35 లక్షలు వసూలు చేసింది. కర్ణాటకలో ఈ చిత్రం 50 లక్షల వరకు వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 20 కోట్ల షేర్ సాధించింది.

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు

    బ్రహ్మస్త్ర చిత్రం గత నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 142 కోట్ల షేర్‌ను, 225 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మంగళవారం ఈ సినిమా 150 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Brahmastra movie good start at world box office. Here is the day 4 Official collections are 128 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X