twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్ :'బ్రహ్మోత్సవం' అడ్వాన్స్ టిక్కెట్లు వెనక్కి

    By Srikanya
    |

    హైదరాబాద్: సినిమా రిజల్ట్ దారుణంగా ఉంటే ఎవరూ దానిని కాపాడలేరనే విషయం 'బ్రహ్మోత్సవం' ప్రూవ్ చేస్తోంది. మహేష్ హీరోగా వచ్చిన ఈ చిత్రం నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో వీకెండ్ లో అంటే శని, ఆదివారాల్లో వెళ్దామని అడ్వాన్స్ టిక్కెట్లు తీసుకున్నవాళ్లు సినిమాకు వెళ్లాలా వద్దా అనే డైలమోలో పడ్డారు.

    అయితే మన ఇండియాలో టిక్కెట్ ఒకసారి తీసుకున్నక, కాన్సిల్ చేసుకుంటాను అంటే వెనక్కి ఇచ్చే పద్దతి లేదు. కానీ ఇప్పుడు యుఎస్ లో అలాంటి పద్దతి ఎదురౌతున్నట్లు సమాచారం. వీకెండ్ లో వెళ్దామని టిక్కెట్లు తీసుకున్న చాలా మంది ఫ్యామిలి ఆడియన్స్ తమ టిక్కెట్లు కాన్సిల్ చేసుకుంటాం , వెనక్కి ఇచ్చేమని ధియోటర్ వారిని అడుగుతున్నట్లు సమాచారం.

    వాస్తవానికి ఇప్పటివరకూ ఓవర్ సీస్ లో మహేష్ బాబు ...కింగ్. ఆయన సినిమా ఇక్కడ యావరేజ్ లు కూడా అక్కడ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా శ్రీమంతుడు చిత్రం పెద్ద హిట్టైంది. అలాంటిది నెగిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ దారుణంగా ఉండటంతో చాలా మంది ఆడియన్స్ తమ డబ్బుని రిఫెండ్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నమ్మబుద్ది కాకపోయినా ఇది నిజమే అని చెప్తున్నారు.

    Brahmostavam tickets refunds in USA

    దాంతో ఇప్పుడు ఓవర్ సీస్ లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు పది కోట్లు వరకూ లాస్ అవతారని అంచనా. సర్దార్ గబ్బర్ సింగ్ తరహాలో ఈ చిత్రం ఓవర్ సీస్ లో పెద్ద డిజాస్టర్ గా మారింది. ఓవర్ సీస్ లో బ్రహ్మోత్సవం చిత్రాన్ని 13 కోట్లకు కొనటం జరిగింది. ఈ రెండు చిత్రాలు రాబోయే చిత్రాల ఓవర్ సీస్ మార్కెట్ల బిజినెస్ లపై ఖచ్చితంగా ప్రభావం చూపెట్టడం ఖాయం.

    'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మహేష్‌కి దక్కిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ విజయం అందించిన ఉత్సాహంతో మరోసారి కుటుంబ కథని నమ్మి 'బ్రహ్మోత్సవం' చేశాడు మహేష్‌. 'సీతమ్మ...'ని తెరకెక్కించిన శ్రీకాంత్‌ అడ్డాలనే ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి రెండోసారి కూడా 'సీతమ్మ...' తరహా మేజిక్‌ వర్కవుట్ కాలేదనే చెప్పాలి.

    మహేష్‌బాబు, కాజల్‌, సమంత, ప్రణీత, సత్యరాజ్‌, రావు రమేష్‌, జయసుధ,రేవతి,శరణ్య,ఈశ్వరి,తనికెళ్ల భరణి,సాయాజీషిండే, నాజర్‌, తులసి,కృష్ణభగవాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు, కళ: తోట తరణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: పెరల్‌.వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, మహేష్‌బాబు, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల . సమర్పణ: జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌.

    English summary
    Brahmostavam is heading towards as a biggest disaster of Mahesh Babu’s recent films both from domestic as well as in overseas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X