Bramayugam 3 Days Collections భ్రమయుగంకు రికార్డు కలెక్షన్లు.. మమ్ముట్టి సినిమాకు ఎన్ని కోట్లంటే!

చరిత్రలో మరుగున పడిపోయిన క్షుద్రశక్తులు, మంత్ర విద్యల కథానేపథ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం భ్రమయుగం. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందే ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అంచనాలకు తగినట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కేరళలో వివాదాస్పద మంత్ర విద్య ఐతియామాలా బ్యాక్‌డ్రాప్‌గా కుంచమోన్ పొట్టి అనే క్యారెక్టర్ నేపథ్యంతో భ్రమయుగం సినిమా రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఆడియెన్స్ నుంచి భారీ క్రేజ్, డిమాండ్ ఉండటంతో ఈ మూవీని మలయాళంలో 500 స్క్రీన్లు, ఇండియాలో 200 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మలయాళంలో 600 షోలు, కన్నడలో 125 షోలకు ఏర్పాటు చేశారు.

Bramayugam Movie 3 Days Box Office Collections Worldwide

భ్రమయుగం సినిమాకు ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఉత్తర అమెరికా, బ్రిటన్‌లో భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. అమెరికా, కెనడాలో 50 వేల అమెరికన్ డాలర్లు,యూకేలో 50 వేల పౌండ్లు వసూలు చేసింది. యూకేలో 45 పౌండ్లు, ఐర్లాండ్‌లో 5 వేల పౌండ్లు వసూలు చేసింది.

ఇక భ్రమయుగం సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళలో తొలి రోజు 3.10 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 35 లక్షలు, తమిళనాడులో 15 లక్షలు, ఏపీ, నైజాంలో 30 లక్షల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు కేరళలో 2.5 కోట్లు, కర్ణాటకలో 30 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షలు, తమిళనాడులో 15 లక్షలు రాబట్టింది.

ఇక మూడో రోజు కూడా నిలకడగా, భారీగా కలెక్షన్లు రాబట్టింది. కేరళలో 3వ రోజు 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షలు, తమిళనాడులో 30 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 30 లక్షలు కలెక్ట్ చేసింది.

Bramayugam Movie 3 Days Box Office Collections Worldwide

ప్రపంచవ్యాప్తంగా భ్రమయుగం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లో 40 లక్షలు రూపాయలు, యూకేలో 55 లక్షలు రూపాయలు, ఇండియాలో 11 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా మూడు రోజుల్లో 12 కోట్లు నికర వసూళ్లు సాధించింది. ఈ సినిమా సుమారుగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X