Bramayugam Collections Worldwide మమ్ముట్టి మూవీకి భారీ కలెక్షన్లు.. భ్రమయుగంకు ఎన్ని కోట్ల వసూళ్లంటే?
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్ నటించిన భ్రమయుగం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. మలయాళం భాషలో మాత్రమే రిలీజైన ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా గత 6 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..
భ్రమయుగం బడ్జెట్ ఎంతంటే? :భ్రమయుగం సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సుమారుగా 28 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 30 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాను సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లకుపైగా ప్రదర్శిస్తున్నారు. మలయాళంలో భారీగా రిలీజ్ చేయగా.. దక్షిణాదిలోని పలు ప్రధాన నగరాల్లో పరిమిత స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

మలయాళంలో కలెక్షన్లు ఎంతంటే? :భ్రమయుగం మలయాళంలో కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 3 కోట్ల రూపాయల నికర వసూళ్లు, 2వ రోజు 2.5 కోట్లు, 3వ రోజు 3.35 కోట్లు, 4వ రోజు 3.9 కోట్లు, 5వ రోజు 1.65 కోట్లు, 6వ రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత ఆరు రోజుల్లో మలయాళంలో 16 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది.
తెలుగు, కన్నడ, తమిళంలో :భ్రమయుగం సినిమా తెలుగు, కన్నడ, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో వసూళ్ల వివరాల్లోకి వెళితే.. గత 6 రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి. కన్నడలో 2 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు 4 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షలు నికరంగా 1 కోటి రూపాయలు గ్రాస్, తమిళనాడులో 1.2 కోట్ల రూపాయలు నికరంగా 2 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

ఓవర్సీస్‌లో భ్రమయుగం కలెక్షన్లు:భ్రమయుగం సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా స్పందన కనిపిస్తున్నది. మలయాళంలో కంటే ఈ సినిమా అధికంగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్ దేశాల్లో భారీగా రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్‌గా కలెక్షన్లు:భ్రమయుగం సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో 16 కోట్లకుపైగా, దక్షిణాదిలో 5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 17 కోట్ల రూపాయలు కలెక్షన్లు కలిపి సుమారుగా 40 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. ఈ సినిమా త్వరలోనే 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











