Bramayugam Box Office Collections మమ్ముట్టి మూవీకి బ్లాక్‌బస్టర్ టాక్.. భ్రమయుగంకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన ప్రయోగాత్మక చిత్రం భ్రమయుగం సినిమాకు భారీ ఆదరణ లభిస్తున్నది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు నైట్ షిప్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భ్రమయుగం సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ తెలుగు, ఇతర భాషల్లో కాకుండా మలయాళంలో ఈ సినిమాను మొదటగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నటించిన మమ్ముట్టి రెమ్యునరేషన్‌తోపాటు ఈ సినిమాను 28 కోట్ల మేర బడ్జెట్ తెరకెక్కించారు.

భ్రమయుగం సినిమాకు ట్రైలర్, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ మంచి హైప్ తీసుకొచ్చాయి. దాంతో మలయాళంతోపాటు ఓవర్సీస్‌లో భారీగా క్రేజ్ కనిపించింది. దాంతో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేశారు. మలయాళంలో 500 స్క్రీన్లు, ఇండియాలో 200 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మలయాళంలో 600 షోలు, కన్నడలో 125 షోలు ప్రదర్శించారు.
భ్రమయుగం సినిమాకు తొలి రోజు మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కొట్టాయంలో 85 శాతం, కోజికోడ్‌లో 60 శాతం, కొల్లాం 40 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం, ముంబైలో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక భ్రమయుగం సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. యూఎస్, యూకే, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, గల్ఫ్, యూరప్, మిగితా దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలి రోజు 2.3 కోట్ల రూపాయలను కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది. కరెంట్ బుకింగ్‌తో కలిపి 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, భ్రమయుగం సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ కేరళ, కన్నడ, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 3 కోట్ల రూపాయలు నికరంగా, 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 3.5 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా తొలి రోజు 7 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











